పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు


Thu,June 13, 2019 12:40 AM

మేడ్చల్ కలెక్టరేట్: ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్య లు ఉంటాయని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి హెచ్చరించారు. వ్యవ సాయ అధికారులు, వైద్య అధికారులు, పశువైద్య అధికారులతో రైతుబంధు, గొర్రె లకు నట్టల మందు, వాక్సిన్‌లు, కేసీఆర్ కిట్, ఇమ్యునైజేషన్ తదితర అంశాలపై బుధవారం కలెక్టర్ వీడియోకాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరు కోవా లని అధికారులకు సూచించారు. వర్షాలు మొదలవుతున్నందున విత్తనాలు, ఎరు వులు సిద్ధంగా ఉంచుకొని రైతులకు పంపిణి చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు పంటరుణాలు ఇప్పించాలని, బ్యాం కర్లు రుణాలు ఇవ్వనిచో కలెక్టర్, ఎల్‌డియం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతుబంధు పథకం కింద రైతులకు బ్యాంకు ఖాతా ద్వారా డబ్బులు జమచేయడానికి రైతుల అకౌంట్ నంబర్లను సేకరించి వెంటనే అప్‌లోడ్ చేయాలని ఎఇఓలను ఆదే శించారు.

గొర్రెలకు నట్టలమందు, వాక్సిన్ వేయా లని, జీవాలకు వ్యాదులు సోకకముందే వాక్సిన్‌లు వేసి నివారించవచ్చని పశు వైద్యాధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లా హైదరాబాద్‌లో బాగమైనందున జిల్లాలో సుమారు 35 లక్షల జనాభా ఉన్నారని, జిల్లాలో పరి శ్రమలు, కాలేజీలు, కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఉన్నందున జననివాసం ఎక్కువైయిందని జిల్లాలో పనికోసం పేద ప్రజలు ఎక్కువగా వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్ప ర్చుకుంటున్నారని అందుచేత మురికి వాడలను, శుభ్రం లేని పరిసరాలను గుర్తించి దోమలు, నీరు నిల్వకుండా చేయాలని అక్కడి ప్రజలకు ఎఎన్ ఎమ్‌లు, ఆశ వర్కర్ల ద్వారా వ్యాధులపై అవగాహన కల్పించలని వైద్యాధికారులకు సూచించారు. పిహెచ్‌సీలలో లక్ష్యం మేరకు బయిటి రోగులను పరిక్షించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, గర్బిణిలకు, పిల్లలకు వాక్సిన్‌లు వేయాలని ఆదేశించారు. కేసీఆర్ కిట్‌లో గర్బిణిల పేర్లను నమోదు చేయించి వారికి తగిన వైద్యం అందిం చాలని అన్నారు. ఈ వీడియోకాన్పరెన్స్‌లో జిల్లా వైధ్యాధికారి నారాయణ, జిల్లా పశు వైద్యాధికారి వీరనంది, జిల్లా వ్యవపాయాధికారి శోభరాణి, ఉద్యానవన శాఖ అధికారి సత్తర్,జిల్లా టీబీ కంట్రోల్ అధికారి సంధ్యరాణి పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...