హవాల దందా గుట్టురట్టు


Thu,June 13, 2019 12:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హవాల దందాను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ. రూ. 1,01,80,000 కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన జితేందర్ నాత్ అలియాస్ జిత్తు హైదరాబాద్‌కు వలస వచ్చి జ్ఞాన్‌బాగ్ కాలనీలో కుటుంబ సమేతంగా నివాసముంటున్నాడు. ఇతని సోదరుడు ఢిల్లీ నుంచి హవాల దందా చేయడం లో ఆరితేరాడు. హవాల దందాలో 0.6 నుంచి 0.8 శాతం కమీషన్ తీసుకుంటున్నాడు. బయటకు డ్రై ఫ్రూట్స్ కమీషన్ ఏజెంట్‌గా నటిస్తూ... తన స్నేహితుడైన సురేశ్ శర్మతో కలిసి బేగంబజార్, జ్ఞానబాగ్ కాలనీ, గుజరాతీగల్లీ, కోఠి ప్రాంతాల్లో హవాల దందాను నిర్వహిస్తున్నాడు.

కాగా... కడప, పొట్లదర్తి ప్రాంతానికి చెందిన సీఆర్ అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చరణ్ తేజ్ నాయుడు వివిధ ప్రాంతాల్లోని తన కంపెనీల్లో పనిచేస్తున్న లేబర్‌కు వేతనాలు ఇచ్చేందుకు ఈ డబ్బును హవాల మార్గంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలోని జితేందర్ సోదరుడి సూచనలతో ఈ డబ్బును హవాల మార్గంలో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాస్‌రావు బృందం ఖైతరాబాద్‌లో ఈ ముఠాను పట్టుకుంది. హవా ల డబ్బు చేతులు మారుతుండగా జితేందర్, సురేశ్ శర్మతో పాటు సీఆర్ అసోసియేట్స్ అకౌంటెంట్, అసిస్టెంట్ అకౌంటెంట్ లక్ష్మినారాయణ హేమ సుందరం, బండి బాలకృష్ణలను అదుపులోకి అదుపులోకి తీసుకు న్నారు. వారి వద్ద రెండు బ్యాగ్‌లో ఉన్న నగదు, రెండు యాక్టివా బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డబ్బుతో పాటు, అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...