21 నుంచి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పై రాకపోకలు


Thu,June 13, 2019 12:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే మరమ్మతు పనులలో భాగంగా శంషాబాద్ నుంచి మెహిదీ పట్నం వరకు జరుగుతున్న పనులను పూర్తి చేసి ఈ నెల 21వ తేదీ నుంచి రాకపోకలకు అనుమతి ఇవ్వా లని అధికారులకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం హెచ్ ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, ఎస్‌ఈ రవీందర్, ఈఈ యూసుఫ్ హుస్సేన్‌లతో కలిసి అరవింద్ కుమార్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గత ఏఫ్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ మరమ్మతు పనులను ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తి చేసి శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వరకు వాహనాల రాక పోకలకు అనుమతిస్తామని చెప్పారు. ఈ వర్షాకాల సీజన్ అనంతరం మెహిదీ పట్నం నుంచి శంషాబాద్ వరకు మరమ్మతులు చేపడ తామని అరవింద్ కుమార్ పేర్కొన్నారు. మరమ్మత్తులకు సంబంధించిన కోల్డ్ మిల్లింగ్ మిషన్ పనితీరును అధికారులు అరవింద్‌కుమార్‌కు ఈ సందర్భంగా వివరించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలపై ప్రత్యేక దృష్టి సారించి మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. వాహనదారులకు రోడ్డుకు ఇరువైపులా గల పుట్‌పాత్‌లపై పెయింటింగ్ కనబడే విధంగా ఉండాలని, రేడియం సంబంధిం చిన స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్భన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్, హెచ్‌ఎండీఏ డిప్యూటీ ఈఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...