పల్లెల్లో జోరుగా ఉపాధి పనులు


Mon,May 27, 2019 02:41 AM

- ఎండను సైతం లెక్క చేయకుండా ఉపాధి హామీ పనుల్లో కూలీలు
మంచాల: మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కరువు తీవ్ర రూపం దాల్చడంతో రైతులు చేసేందుకు పనులు లేక ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నారు. ఎండలు సైతం తీవ్ర రూపం దాల్చడంతో అదేమీ లెక్క చేయకుండా పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. మండలంలో 6,709 కుటుంబాలకు ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు లక్షా 72 వేల పనిదినాలు కల్పించారు. మంచాల మండలం ఉపాధి పనుల్లో జిల్లాలోనే నెంబర్ వన్‌గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 8వేల మందికి వివిధ పనులు కల్పిస్తున్నట్లు ఉపాధి సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండుతున్నందున చేసే పనితో పాటు కూలీలకు 30 శాతం అదనంగా వేతనం చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు అంటే రెండు నెలల్లో కోటి రూపాయల పనులు చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలో మేజర్ గ్రామ పంచాయితీలు అయిన లోయపల్లి, ఆరుట్ల, మంచాలలో ఉపాధి పనులు చేసేందుకు కూలీలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

కూలీలతో చేయిస్తున్న పనులు
మండలంలోని వివిధ గ్రామాల్లో కూలీలకు ఉపాధి అధికారులు వివిధ రకాల పనులు కల్పిస్తున్నారు. అందులో కందకాల తవ్వకాలు, భూమి చదును, భూమి సమతుల్యత, మట్టిరోడ్లు, వాలుకు అడ్డంగా తీసిన కందకాలు, నర్సరీల్లో మొక్కల పెంపకంతో పాటు తదితర పనులు చేపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనిచేసిన ప్రతి కూలీకి వారంవారం డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...