నగరంలో ఆబ్కారీ దాడులు


Sat,May 25, 2019 01:02 AM

-గంజాయి, కల్తీకల్లు పట్టివేత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆబ్కారీ నేరాలను అరికట్టే క్రమంలో హైరదాబాద్ జిల్లా డీటీఎఫ్ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు నగరంలోని నాంపల్లి, చార్మినార్, ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలో దాడులు జరిపారు. జిల్లా డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కంచర్ల కరుణారెడ్డి కథనం ప్రకారం...చార్మినార్ పరిధిలోని పురానాపూల్, పార్థివాడలో అక్రమంగా బెల్టుషాపు నిర్వహిస్తున్న సత్యనారాయణను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 15.84లీటర్ల ఐఎంఎల్ లిక్కర్, 9.75లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట పరిధిలో బెల్ట్‌షాపును సీజ్‌చేసి రితేష్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.88లీటర్ల లిక్కర్, 6.5లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పరిధిలోని ఆసిఫ్‌నగర్‌లో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న రవీందర్‌సింగ్‌ను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 17.28లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట పరిధిలోని మచిలీపురలో గంజాయి విక్రయిస్తున్న వీరేందర్‌సింగ్‌ను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 1.2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పరిధిలోని మాం గార్‌బస్తీలో అక్రమంగా కల్లుకాంపౌండ్ నిర్వహిస్తున్న గిరిధర్‌ని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 156లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమి త్తం కేసులను సంబంధిత స్టేషన్ అధికారులకు అప్పగించారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...