విద్యుత్ స్టోర్‌లో చోరీకి యత్నం


Sat,May 25, 2019 01:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/వెంగళరావునగర్: టీఎస్‌ఎస్పీడీసీఎల్ విద్యుత్ స్టోర్‌లో చోరీ ప్రయత్నం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన ఎర్రగడ్డలోని హైదరాబాద్ సిటీ స్టోర్ నుంచి డీసీఎం (టీఎస్ 09 యూబీ 3590) వాహనంలో రూ.2,92,600 విలువు గల 5320 కిలోల ఎంఎస్ ఏంగిల్స్‌ను అక్రమంగా కొంతమంది తరలిస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ డివిజనల్ ఇంజినీర్ ఆ వాహనాన్ని బాలానగర్ క్రాస్ రోడ్డు వద్ద ఆపి దాన్ని బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంబంధిత స్టోర్ ఇన్‌చార్జి అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత స్టోర్స్‌లోని ఏఏఈ యాదయ్య అనధికారికంగా ఆ మెటీరియల్‌ను బయటకు పంపినట్టు నిర్థారించారు. ఆ వాహనాన్ని, డ్రైవర్, డ్రైవర్ సహాయకులపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక నిర్థారణ ప్రకారం.. ఈ వ్యవహారానికి బా ధ్యుడైన ఏఏఈ యాదయ్యను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై సంస్థ విజిలెన్స్ విభాగం సమగ్ర దర్యాప్తు చేస్తుంది. ఈ సందర్భంగా బంజరాహిల్స్ ఎస్‌ఈ స్పం దిస్తూ.. సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంస్థకు నష్టం వాటిల్లే విధంగా పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...