నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం


Thu,May 23, 2019 12:00 AM

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయమే ప్రారంభంకానున్నది. భువనగిరి సమీపంలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఈ లెక్కింపు జరుగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే అత్యధికంగా 2,77,498 ఓట్లు ఉన్నాయి.

ఇందులో 75 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 314 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. భువనగిరి పార్లమెంట్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీపీఎం, బీజేపీతో పాటు స్వత్రంత్రులు కూడా పోటీ చేశారు. కాగా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి మధ్య నెలకొన్నది. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఐదేండ్లుగా ఎంపీగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పా టు డాక్టర్‌గా ప్రజల్లో మంచి పేరున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నియోజకవర్గంలో బహిరంగసభలు కూడా నిర్వహించారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేయడంతో ఆ పార్టీ సైతం ఈ నియోజకవర్గంపై గెలుపు ఆశలు పెట్టుకున్న ది. కాగా నేడు జరుగనున్న ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలే రు, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజక వర్గా ల్లో మొత్తం 2067 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 2,77,498 ఓట్లకుగానూ, 1,84,953 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లను 23 రౌండ్లలో లెక్కించనున్నారు. దీంతో మధ్యాహ్నం వరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పూర్తికానున్నది. కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లు కొంతమంది బుధవారం రాత్రి భువనగిరికి చేరుకున్నారు. గురువారం ఉదయం 7గంటల నుంచి ఏజెంట్లు కౌంటింగ్‌కు హాజరుకావాల్సి ఉన్నందున వారి కోసం ఆయాపార్టీలు భువనగిరిలో హోటళ్లు బుక్‌చేశారు. రెండుపార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కే అధిక శాతం గెలిచే అవకాశాలున్నాయి.

నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 14టేబుళ్లు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలైన ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోలైన ఓట్లను మొత్తం 23 రౌండ్లుగా విభజించారు. ఈ ఓట్ల లెక్కిం పు కోసం సుమారు వందమంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు భువనగిరి సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమరేందర్ తెలిపారు. ఒక్కొక్క టేబుల్‌కు నలుగురు అధికారుల చొప్పున ఉంటారన్నారు. ఒకవేళ ముందుగా వీవీప్యాట్ల లెక్కింపు జరిపితే కౌంటింగ్‌కు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. ముందుగా ఓట్ల లెక్కింపు జరిపి, తరువాత వీవీ ప్యాట్ల లెక్కిస్తే ఇబ్రహీంపట్నం ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2గంటలకే పూర్తి కానున్నదన్నారు.

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం...
42 రోజులుగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనున్నది. గత నె ల 11న పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కిం పు ఈనెల 23న జరుగుతున్నది. సుమారు నలభై రెండురోజుల సుదీర్ఘ విరామం తరువాత కౌంటింగ్ జరుగుతుండడంతో గ్రామాల్లో కూడా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఉత్కంఠ నెలకొన్నది.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...