కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి


Thu,May 23, 2019 12:00 AM

కందుకూరు: డివిజన్ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీలకు నిర్వహించిన ఎన్నికల లెక్కింపును మండలంలోని రాచులూరు గేటు సమీపంలో గల నిశితా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణ కుమారి తెలిపారు. ఈ ఓట్ల లెక్కింపును పటిష్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మహేశ్వరం, ఆమనగల్లు మండలాల ఎన్నికల అధికారులు వెంకట్‌రాములు, నర్సింలుతో కలిసి బుధవారం కందు కూరు మండల పరిషత్ కార్యాలయం లో ఓట్ల లెక్కింపు విషయంలో కందు కూరు, మహేశ్వరం సీఐలు జంగయ్య, వెంకన్న నాయక్‌లతో కలిసి సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడు తూ, ఈ నెల 27వ తేదిన నిర్వహించే ఓట్ల లెక్కిం పులో విజయం సాధించిన వారు ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు నిర్వ హించడానికి అనుమతి లేదన్నారు.

టపాకాయలు కాల్చడానికి వీలులేదని చెప్పారు. పోటీ చేసే అభ్యర్థితో పాటు కౌంటింగ్ ఏజెంట్‌కు మాత్రమే అనుమతిని ఉంటుందన్నారు. 250 మంది పోలీస్ సిబ్బందిని నియమిస్తున్న ట్లు వారు తెలిపారు. కందుకూరు 20, మహేశ్వరం, తలకొండపల్లి 14, ఆమనగల్లు 5, కడ్తాల్ 12 టేబుళ్లు, మొత్తం 66 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 56 మంది ఎంపీటీసీలకుగాను 200 మంది వరకు ఎంపీటీసీ కోసం అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎంపీ టీసీల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. జడ్పీటీసీకి మాత్రం రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 5 మండలాల్లో 5గురు జడ్పీటీసీలకు 29 మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. ఎన్నికల అధికారులతో పాటు జడ్పీటీసీల ఆర్‌ఓలకు మాత్రమే సెల్ ఫోన్‌లు అనుమతి ఉంటుందన్నారు. లెక్కింపుపై హాజరయ్యే వారికోసం పార్కింగ్‌ను కళాశాల గేటుకు ఎదురుగా ఉన్న వెంచర్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోటీ చేసే అభ్యర్థులతో పాటు కౌటింగ్ ఏజెంట్లు గంటముందే కౌంటింగ్ కేంద్రానికి చేరుకో వాలని, 7.30గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కింపు 8గంటలకు ఓట్లను లెక్కించి మధ్యాహ్నం వరకు ఎంపీటీసీల ఫలితాలను వెల్లడిస్తామన్నారు. అనంతరం జడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపుపై సజా వుగా నిర్వహించడానికి కృషిచేయాలని కోరారు. కౌం టింగ్ నిర్వాహణకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడానికి అందరూ సహకరించాలని కోరారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...