మరుగుదొడ్ల నిర్మాణంలో వేగం పెంచండి


Thu,May 23, 2019 12:00 AM

కేశంపేట: గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని డీఆర్‌డీఏ డీపీఎం నర్సింహులు కోరారు. కేశంపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సీసీలు, వీఓఏలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయించి, మొదలు పెట్టని లబ్ధిదారులతో నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. నిర్మాణాలు పూర్తైన వాటికి వెంటనే బిల్లులు ఇప్పించి ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రాజేందర్‌సింగ్, ఈఓపీఆర్డీ మనోహర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం భగవంతు, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్: గ్రామంలో ప్రతి కుటుంబం మురుగుదొడ్డిని నిర్మించుకోవాలని ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి సర్పంచ్ లక్ష్మీరమేశ్ కోరారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. బహిరంగా ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయడంతో వివిధ రకాల వ్యాధులు వస్తాయనే విషయాన్ని గ్రామస్తులు గ్రహించాలన్నారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలివేలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...