అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి


Wed,May 22, 2019 11:59 PM

కొందుర్గు: ప్రజలు, పార్టీల ప్రతినిధుల సహకారంతో గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు ఎంపీపీ ఆవుల గాయత్రి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. మండల పరిధిలోని పలువురి అధికారుల పనితీరుపై సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే సమాధానం ఉండదని వారు మండిపడ్డారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ప్రజాప్రతినిధులకు చెప్పడం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తేనే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏ పార్టీ నాయకుడైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కోరుతారని ఆయన వెల్లడించారు. పార్టీలను కేవలం ఎన్నికల వరకే ఉంచాలని ఆయన తెలిపారు. ఎన్నికల తరువాత గెలిచిన ఓడిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన తెలిపారు. రాబోయో రోజుల్లో ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ అందుతుందని ఆయన తెలిపారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు బంగారు స్వరూప, ఎంపీడీఓ ప్రతాప్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీ యాదగిరిగౌడ్, ఎంఈఓ కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...