శ్రీ హనుమాన్‌ దేవాలయ వార్షికోత్సవం


Tue,May 21, 2019 12:13 AM

శంషాబాద్‌, మే 20 : ఇంతింతై వటుడింతై....అన్న చందాన చిన్న దేవాలయం ఓ వదాణ్యుని దాతృత్వంతో బహుదేవతాలయాల క్షేత్రంగా దినదినప్రవర్ధమానం చెందుతుంది. శంషాబాద్‌ మండలం చినగొల్లపల్లిలో నగరంలోని ప్రముఖ వ్యాపారి సరితాదేవి, అనిల్‌కుమార్‌ అగర్వాల్‌ దంపతులు ఆలయాన్ని పునరుద్ధరించి ఉపాలయాలతో పెద్ద హనుమాన్‌ దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా వార్షిక బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది 4 వ వార్షికోత్సవం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరగనున్న శ్రీ హనుమాన్‌ దేవాలయ 4వ వార్షిక మహోత్సవాలు తొలిరోజు హోమంతో మండల టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ జిట్టె సిద్దులు దంపతులచే వేదపండితులు శాస్ర్తోక్తంగా ఆరంభించారు. ఉదయం మంగళవాయిద్యాలతో ప్రధాన దేవతారాధన, అభిషేకాలు, అలంకరణ, గణపూజ, అఖండ దీపారాధన, పుణ్యహవాచనం, రక్షాబంధన్‌, దీక్షాధారణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన, వేదపండితులచే ఆశీర్వచనం, వేదపారాయణం, మహామంగళహారతి, తీర్థప్రసాద పంపిణీ చేశారు. నేడు మూల మూర్తుల అభిషేకాలు, అగ్ని మధనం, రుద్రహోమం, గోపూజ, ఈ నెల 23న దేవతార్చన, కళశాభిషేకం, రుద్రహోమం, శివపార్వతుల కల్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరిరోజు ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కృతార్థులు కాగరని కోరారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...