గ్రామాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత


Tue,May 21, 2019 12:13 AM

నందిగామ: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ప్రజాప్రతినిధులు అన్నా రు. మండల కేంద్రంలో సర్పంచ్‌ జిల్లెల వెంకట్‌రెడ్డి, వెంకమ్మగూడలో సర్పంచ్‌ రజినీత వీరేందర్‌గౌడ్‌, బం డోనిగూడ గ్రామంలో సర్పంచ్‌ జట్టకుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రా మాల్లో మరుగుదొడ్లు లేనివారు తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు. బహిరంగా ప్రదేశాల్లో చెత్త వేయకూడదని, ఇష్టానుసారంగా చెత్త వేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యకరమంలో నందిగామ, వెంకమ్మగూడ, బండోనిగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు శ్వేత, అమీద్‌, సుధాకర్‌, ఉప సర్పంచ్‌లు కుమార్‌గౌడ్‌, మధు, టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ అభ్యర్థి ఈట గణేశ్‌, వార్డుసభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, ఈశ్వర్‌, సంజీవ్‌, కవిత శ్రీనివాస్‌, శోభారాణి వేణు, దేవప్ప, చంద్రకళ నర్సింహ, యాదయ్య, బుచ్చయ్య, పాండయ్య, రాజు, మణిక్యం, నవీన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...