చురుగ్గా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మరమ్మతు పనులు


Mon,May 20, 2019 04:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే సరికొత్తగా ముస్తా బు అవుతుంది. 11.6 కిలోమీటర్ల ైఫ్లె ఓవర్‌ను అధునాతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన హెచ్‌ఎండీఏ అధికారులు ఈ మేరకు దాదాపు రూ. 22కోట్లతో పలు పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రూ. 8.28కోట్లతో బ్లాక్ టాపింగ్ పనులకుగాను ట్రాఫిక్ పోలీసుల నుంచి గత నెల 24న అనుమతి తీసుకుని పనులను చేపట్టారు. తొలి నాలుగు రోజుల పాటు పను ల నిర్వహణ తీరు తెన్నులపై సర్వే జరిపారు. సాధారణంగా రోడ్లపై పాతదాన్ని అలాగే ఉంచి దారిపై కొత్తగా తారు వేస్తారు. ఐతే ఇక్కడ పై వంతెన కావడంతో అక్కడ అలా చేయడం కష్టం. అలా చేస్తే రోడ్డు ఎత్తుగా మారుతుంది. మందం ఒకేలా ఉండదు. ప్రత్యేక యంత్రాలతో అంతకు ముందు వేసిన తారు పైపొరను తొలగిస్తున్నారు. ఇదే సమయంలో మిల్లింగ్ పనులు పూర్తయిన తర్వాత కొత్తగా తారు వేస్తున్నారు. నాలుగు లేన్లలో పనులు పూర్తి కావడానికి 45 రోజుల నిర్ధేశిత లక్ష్యంగా పనులు చేపట్టగా వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని హెచ్‌ఎండీఏ ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక లక్ష్మీగూడ, హైదర్‌గూడ ర్యాంపుల వద్ద పనులకు అనుమతి లభించిందని, ప్రార్థన మందిరం అంశం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉందని, రూ. 2 కోట్లతో ైఫ్లె ఓవర్ కింద లైటింగ్ ఏర్పాటు పనులు త్వరలో చేపడతామని చెబుతున్నారు. ప్రస్తుతం పనుల్లో వేగం పెరిగిందని, వర్షాలు లేకపోతే నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...