సాహిత్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు


Mon,May 20, 2019 04:02 AM

చిక్కడపల్లి: అమెరికాలో గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అడిక్ మెట్ డివిజన్ పద్మకాలనీ వాసి సాహిత్‌రెడ్డికి కుటుంబ సభ్యు లు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. చివరి చూపు కోసం వేచి చూసిన తల్లిదండ్రులు శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సాహిత్ రెడ్డి భౌతిక కాయం చేరుకోవడంతో బోరున విలపించారు. ఆదివారం ఉదయం 6 గం టల నుంచే బంధువులు,స్నేహితులు సాహిత్ రెడ్డి చివరి చూపు చూసేం దుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాహిత్‌రెడ్డి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 1గంటలకు అంబర్‌పేట్ స్మశాన వాటికలో నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సాహిత్ రెడ్డి బౌతిక కాయాన్ని సంద ర్శించి నివాళులు అర్పించారు. ఐఎన్‌టీయూసీ జాతీ య అధ్యక్షుడు జీ సంజీవ రెడ్డి,యువ నాయకుడు ముఠా జైసింహా,మాజీ కార్పొరేటర్ జైరాం రెడ్డి,ముచ్చకుర్తి ప్రభాకర్,ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అంజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్ని నివాళులు అర్పించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...