కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష


Mon,May 20, 2019 04:02 AM

కీసర: ఈనెల 23వ తేదీన జరిగే మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సంబం ధించిన ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎఆర్‌ఓలు, నోడల్ అధికారులతో వీడియోకాన్పరెన్స్ ద్వారా జిల్లా రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎం.వీ.రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెం ట్లకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్లలో జరిగే కౌంటింగ్ ప్రక్రియను విజయ వంతంగా నిర్వహించడానికి ఈనెల 21వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి, ఎజెంట్లకు, మీడియా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేయాలని సూచించారు. కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ హాల్‌లో చేస్తున్న ఏర్పాట్ల వివరాలను నియోజకవర్గాల వారిగా ఎఆర్‌ఓలను అడిగి తెలుసు కున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ఎజెంట్‌లు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించ కూడదన్నారు. కౌంటింగ్ హాల్‌లో సీసీకెమెరాలు ఏర్పాట్లు చేయడం జరుగు తుందని, మొత్తం కౌంటింగ్ హాల్‌లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మొత్తం కౌంటింగ్ ప్రక్రియను వీడి యో రికార్డింగ్ చేయడం జరుగుతుందన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలానికి కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డి.శ్రీనివాస్‌రెడ్డి,డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, ఆర్‌డీఓ మధుసుదన్, ఆర్‌ఓలు నోడల్ అధికారులు, ఎలక్షన్ సూపర్‌డెంట్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...