ట్రాఫిక్ రూల్స్ పాటించాలి


Sun,May 19, 2019 02:44 AM

-రోడ్డు ప్రమాదాలతో దేశంలో ఏటా లక్షన్నర.. తెలంగాణలో 7200 మంది మృత్యువాత
-ప్రమాదాల నివారణకు అందరి కృషి అవసరం
-రోడ్డు భద్రతా విభాగం డీజీ కృష్ణప్రసాద్
-రాచకొండ పొలీసుల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్ ప్రారంభం
-ఫొటో గ్యాలరీని పరిశీలించిన డీజీ, సీపీ
పెద్దఅంబర్‌పేట: ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రతి ఏటా దేశంలో సుమారు లక్షన్నర మంది మృత్యువా త పడుతున్నారని, తెలంగాణలో 7200 మంది వాహన ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని రోడ్డు భద్రతా విభా గం డీజీ కృష్ణ ప్రసాద్ అన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని తట్టిఅన్నారం లో గల జెవ్యాలీ రిసార్ట్స్‌లో సమ్మర్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్స్ పీపుల్ ఫ్రెండ్లీ పొలీసు కార్యక్రమాన్ని శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులనుద్దేశించి మా ట్లాడారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌రూల్స్ పాటించాలని సూ చించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఎక్కువగా 15 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు గల వారే ఉంటున్నారన్నారు. మద్యం సేవిస్తూ, సెల్‌ఫోన్ల లో మాట్లాడుతూ, సీటు బెల్ట్‌లు పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. మైనర్ విద్యార్థులు బైక్‌లు నడుపడం వల్ల కూడా ప్రమా దాలు అనేకం చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలి పారు. రోడ్డు భద్రతా విషయంలో ముందుగా విద్యార్థుల ను చైతన్యపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకునేలా, హెల్మెట్లు వాడేలా ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుందన్నారు.

అనుభవం లేని తమ చిన్నారులకు వాహనాలు ఇచ్చి వారి జీవితాలు నాశనం చేసుకోరాదన్నారు. కశాళాలలు, పాఠశాలలకు వెళ్లేటప్పుడు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. తాము బాగానే వెళ్తున్నామని అనుకున్నా, ఎదురుగా వచ్చే వారు సక్రమంగా రాకపోవచ్చని, ఆ సమయంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. బైక్‌పై వెళ్తున్న వారు కూడా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తున్నామన్నారు. మద్యం సేవిస్తూ వాహనాలు నడిపే వారి సంఖ్య నిత్యం పెరిగిపోతోందని, వారిపై రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరిం చారు. ట్రాఫిక్ సమయాల్లో పోలీసులకు సహకరించా లన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు అందరి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం క్యాంపులో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీపీతో కలిసి పరిశీలించారు. ఈ క్యాంప్ ఆదివారం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్ర మంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, సొసైటీ ఫర్ సైబరాబాద్ కౌన్సిల్ కార్యదర్శి కృష్ణ, సభ్యులు వెంకట్, జెన్‌పాక్ట్, వైస్ ప్రెసి డెంట్ సతీశ్, వనస్థలిపురం ట్రాఫిక్ డీసీపీ విజయ్‌చరణ్, కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...