ప్రత్యేక తరగతులు దోహదం చేశాయి..


Sun,May 19, 2019 02:20 AM

వంద శాతం ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. చక్కని విద్యాబోధన తో మంచి మార్కులు సాధించేందుకు ఎంతగానో దోహదం చేశాయి. ప్రణాళికబద్దంగా విద్యాబోధనతో వంద శాతం మార్కులు సాధిస్తామన్న నమ్మకం పెరిగింది. పాఠాలను ఎంతో అర్థవంతంగా బోధించడంతో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 10/10 జీపీఏ మార్కులు సాధించడం సంతోషంగా ఉంది. పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది.

ప్రవళిక, జడ్పీహెచ్‌ఎస్‌, తలకొండపల్లి డిజిటల్‌ తరగతులతో అవగాహన..
డిజిటల్‌ బోధనతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు మంచి అవకాశం లభించింది. డిజిటల్‌ తరగతులతో చాలా శ్రద్ధతో పాఠాలను అధ్యయనం చేశారు. డిజిటల్‌ తరగతులు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురుచూసే వాళ్లం. పాఠ్యాంశాల వారిగా రూపొందించి.. తెరపై చూసిన పాఠాలు చాలా వరకు గుర్తుతున్నాయి. అర్ధమయ్యో రీతిలో పాఠాలను డిజిటల్‌ ద్వారా బోధించినందుకు మంచి మార్కులు సాధించాం. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందుతున్నాయి.- యార అనిల్‌, జడ్పీహెచ్‌ఎస్‌, తలకొండపల్లి

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...