టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యం


Sun,May 19, 2019 02:17 AM

షాద్‌నగర్‌టౌన్‌: టీబీ వ్యాధి నిర్మూలనే మనంద రి లక్ష్యమని షాద్‌నగర్‌ ప్రభుత్వ దవాఖాన హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు అన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని ఇంద్రానగర్‌కాలనీలో ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన సీ సెంటర్‌లో శనివారం కాలనీవాసులకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యు ల సలహాలతో చికిత్స చేయించుకోవాలని సూచించారు. చిన్నపాటి వ్యాధులే అయినప్పటికీ వాటిపట్ల అలసత్వం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం సమయంలో జ్వరం, ఆకలి, బరువు తగ్గడం, ఛాతినొప్పి వంటివి టీబీ వ్యాధి లక్షణాలుగా గుర్తుంచుకోవాలన్నారు. టీబీ వ్యాధి అని నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా పూర్తి చికిత్స తీసుకోవాలని, వైద్యులు సూచించిన మందులను టీబీ రోగి వాడాలన్నారు. అంతేకాకుండా టీబీ నిర్ధారణ పరీక్షలు, మందులను పూర్తిగా ఉచితంగా ఇవ్వ డం జరుగుతుందన్నారు. ఆరోగ్య కార్యకర్త ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్తి చికిత్స అందించబడుతుందన్నారు. అనంతరం టీబీ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీబీ సూపర్‌వైజర్‌ నరేశ్‌, చించోడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్‌ లిల్లీ, ఏఎన్‌ఎంలు రమదేవి, శిరీష, కల్యాణి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...