సర్కార్‌ బడుల్లో పెరిగిన ఉత్తీర్ణత

Sun,May 19, 2019 02:14 AM

తలకొండపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పది ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు, ల్యాబ్‌ సదుపాయాలు, కంప్యూటర్‌ విద్యతో పాటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుల విద్యా బోధనతో పదో తరగతి ఫలితాల్లో మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది 98.55 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సర్కార్‌ బడుల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నది. మండలంలోని పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిలో చంద్రధన, ఖానాపూర్‌, రాంపూర్‌, వెల్‌జాల్‌ (బాలికలు), వెల్‌జాల్‌ (బాలుర) కస్తూర్బాగాంధీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వెల్‌జాల్‌ బాలికల ఉన్నత పాఠశాల వరుసగా మూడో సారి వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఏడాది తలకొండపల్లి ఉన్నత పాఠశాల 98.81, గట్టుఇప్పలపల్లి, 97.67, పడకల్‌ 97.30, చుక్కాపూర్‌ ఉన్నత పాఠశాలలో 92.68 ఉత్తీర్ణత సాధించాయి.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...