ప్రతి రైతు పంట బీమా చేయాలి


Sun,May 19, 2019 02:13 AM

-జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి శోభారాణి

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో ప్రతి రైతు పంట బీమా చేయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా కింద జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలకు బీమా చేసుకోవచ్చని, 2019 వానాకాలం సీజన్‌కు వరి పంట గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న మండలం యూనిట్‌గా అమలు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆగస్టు 31వ తేదీ వరకు వరి పంటకు బీమా చేయాలని, అలాగే జూలై 31వ తేదీ వరకు మొక్కజొన్న పంటకు బీమా చేయాలన్నారు. జిల్లాకు అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా(ఏఐసీ) కేటాయించడం జరిగిందని, ఆసక్తి ఉన్న రైతులు వెంటనే ఏఐసీ ప్రతినిధులను గానీ, వ్యవసాయ విస్తరణ అధికారుల, మండల వ్యవసాయ అధికారులను గానీ సంప్రదించి పంటబీమా చేయించాలని ఆమె తెలిపారు.

వరి పంటకు ఎకరాకు రూ.34,000 బీమా వర్తిస్తుందని, ఇందుకు ప్రీమియం కింద రైతు కేవలం రూ.680 చెల్లిస్తే సరిపోతుందని, అలాగే మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.25,000 బీమా వర్తిస్తుందని, ఇందుకు రైతు కేవలం రూ.500 చెల్లిస్తే సరిపోతుందని ఆమె సూచించారు. ప్రకృతి విపత్తులు జరిగిన సందర్భంలో పంటలు నష్టపొయిన రైతులకు బీమా వర్తిస్తుందని, ముఖ్యంగా అధిక వర్షపాతం వలన పంటలు దెబ్బతిన్నప్పుడు, వడగండ్ల వానలు పడినప్పుడు, పంటకోత అనంతరం 14 రోజుల్లోపు పంటలు దెబ్బతిన్నప్పుడు ఈ బీమా వర్తిస్తుంది. వానాకాలం 2019కు బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్నైట్లెతే బ్యాంకు రైతువేసే పంటకు ప్రీమియం మినహాయించుకొని రుణం మొత్తంను రైతుకు అందజేస్తారని ఆమె తెలిపారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...