హరేకృష్ణ ఆలయంలో..


Sat,May 18, 2019 01:20 AM

-నరసింహ జయంతి
బంజారాహిల్స్,మే 17(నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని హరేకృష్ణ స్వర్ణ ఆలయంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నరసింహజయంతి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస పర్యవేక్షణలో ప్రారంభమైన జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నరసింహస్వామి మూలవిరాట్‌కు విశేష అభిషేకం నిర్వహించారు.అనంతరం నరసింహహోమం చేశారు.లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం, పల్లకీ సేవ కన్నులపండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...