ఈఎస్‌ఐ కార్డుదారులకు మెరుగైన వైద్య సేవలందిస్తాం..


Sat,May 18, 2019 01:19 AM

-బీమా వైద్య సేవల శాఖ (ఈఎస్‌ఐ) హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాసులు

బన్సీలాల్‌పేట్, మే 17 : ఈఎస్‌ఐ దవాఖానలు, డిస్పెన్సరీలను మరింత అభివృద్ధి పరుస్తామని, బీమా కార్డుదారులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తున్నామని బీమా వైద్య సేవల శాఖ (ఈఎస్‌ఐ) హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాసులు తెలిపారు. వరంగల్ జేడీగా విధులు నిర్వహించి, బదిలీపై వచ్చి హైదరాబాద్ జేడీగా బాధ్యతలను చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు, పేద ప్రజలకు అందించే వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని, అందుకు అనుగుణంగా తమ బీమా వైద్య సేవల శాఖ కూడా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్.మల్లారెడ్డి, ప్రిన్సిపల్ కార్యదర్శి శశాంక్ గోయెల్, ఐఎంఎస్ రాష్ట్ర డైరెక్టర్ సీహెచ్.దేవికారాణిల నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంలో తాము పని చేస్తున్నామన్నారు. బీమా వైద్య సేవల శాఖ, హైదరాబాద్ జేడీ పరిధిలో మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పాత జిల్లాలలో మొత్తం 53 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు నడుస్తుండగా, హైదరాబాద్ జిల్లాలో 23 డిస్పెన్సరీలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జేడీ పరిధిలో పదకొండు లక్షల మంది ఈఎస్‌ఐ బీమాదారులకు తాము వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సకాలంలో మందులు రోగులకు చేరాలనే ఉద్దేశంతో నాచారం, బోరబండ, రామచంద్రాపురంలో మూడు చోట్ల మందుల సరఫరా కోసం నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది పని ఒత్తిడిని తట్టుకుని, ఓపికగా డిస్పెన్సరీలకు వచ్చే బీమాదారులు, వారి కుటుంబ సభ్యులకు చక్కటి వైద్య సేవలు అందిస్తున్నారని, వారి పనితీరు పట్ల ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...