చెరువులను పరిరక్షించాలి


Thu,May 16, 2019 11:47 PM

-ప్రణాళికలు రూపొందించి చెరువుల ఆక్రమణలను అరికట్టాలి
-వ్యర్థాలను మూసీలోకి వదిలితే నోటీసులివ్వాలి
-రిజర్వాయర్లలో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే పరిహారం అందించాలి
-రికార్డుల ప్రకారం పాసుపుస్తకాలు ఇవ్వాలి
-తహసీల్దార్లు గ్రామాల్లో పర్యటించిప్రభుత్వ భూములను కాపాడాలి
-రెవెన్యూ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌లో.. మేడ్చల్‌ కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి
మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణను అరికట్టాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆర్వోసీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చెరువు స్థలాల ఆక్రమణలను అరికట్టాలన్నారు. అలాగే ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ ప్రక్రియను వేగంవంతం చేయాలని, ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు, వైకుంఠదామం, డ్రైనేజీలకు వినియోగించకుండ ఇరిగేషన్‌ అధికారి, పంచాయతీ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు కలిసి గ్రామ పరిధిలో చెరువుల ఆక్రమణలకు గుర్తించి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.

చెరువుల ఆక్రమణలకు అరికట్టేందుకు డీపీఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మూసీనది అభివృద్ధికి సంబంధించి తహసీల్దార్లు, ఇరిగేషన్‌ అధికారులు, సర్వేయర్లు నక్ష తయారు చేయాలన్నారు. మూసీనది కింద వచ్చే పట్టా భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ఆక్రమణలకు గురైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పట్టా భూముల్లో అనధికారిక నిర్మాణాలు జరిగితే నోటీసులు జారీ చేసి వాటిని తొలగించాలన్నారు. పారిశ్రామిక వ్యర్థాలను మూసీలో వదిలినైట్లెతే అందుకు బాధ్యులైన వ్యక్తులను గర్తించి పీసీబీ ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. కేశవాపూర్‌ రిజర్వాయర్‌ కోసం పొన్నాల, బొమ్మరాశిపేట్‌, యాకత్‌పురా గ్రామాల రైతుల నుంచి సేకరించిన భూములను సర్వే చేసిన వారికి వెంటనే పరిహారం అందించాలన్నారు. కోర్టు కేసులు మినహా రికార్డుల ప్రకారం ఖచ్చితంగా ఉన్న ఖాతాలకు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్‌ సీడింగ్‌, పాసుబుక్‌లో తప్పుల సవరణ, మ్యూటేషన్‌, డిజిటల్‌ సంతకం తదితర సేవలలో వేగం పెంచాలన్నారు. రైతుల నుంచి, ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఓసీల జారీలో జాప్యం లేకుండ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూముల వివరాలను అందించాలన్నారు. గతంలో వివిధ శాఖలకు కేటాయించిన భూములను నేటికి వినియోగించనైట్ల్లెతే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. తహసీల్దార్లు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ భూముల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్వో మధుకర్‌ రెడ్డి, ఆర్డీవోలు లచ్చిరెడ్డి, మధుసూదన్‌, లా ఆఫీసర్‌ శంకర్‌నాయక్‌ హెచ్‌ఎండీఏ డీఈ వెంకటరమణ, తహసీల్దార్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...