తండ్రి కోర్కెను తీర్చిన తనయుడు


Thu,May 16, 2019 11:44 PM

చందానగర్‌(నమస్తే తెలంగాణ): శేరిలింగంపల్లిలో తన తండ్రి కోరిక మేర కు ఓ కొడుకు తండ్రి కళ్లతో పాటు పార్ధీవ దేహాన్ని ఓ మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. వివరాల్లోకి వెళితే... చందానగర్‌లో నివా సం ఉండే డాక్టర్‌ ఉమామహేశ్వరరావు స్థానికంగా విజయ హాస్పి టల్స్‌ నిర్వాహిస్తున్నాడు. ఆయన తండ్రి వీర్‌వల్లీ జ్ఞానేశ్వర్‌రావు(80) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఐతే జ్ఞానేశ్వర్‌రావు బ్రతికి ఉన్నప్పుడు తాను మరణిస్తే తన కళు,్ల ఇతర అవయవాలతో పాటు తన పార్ధీవ దేహాన్ని సైతం దానం చేయా లని తరచూ తన కుమారుడు డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావుకు చెబుతుండేవారు. తన దేహం ఖననం కాకుడదని, శిక్షణలో ఉన్న డాక్టర్లకు ఉపయోగపడాలని జ్ఞానేశ్వర్‌రావు ఆకాంక్షించేవారు. కుమారుడు ఉమామహేశ్వరావు భెల్‌ నేత్రదాన సంచాలకర్త అల్లం పాండురంగారావుకు సమాచారం అందించారు. అల్లం నేతృత్వంలో ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టి ట్యూట్‌ వారు బుధవారం రాత్రి జ్ఞానేశ్వర్‌ కళ్లను తీసుకెళ్లారు. అదేవిధంగా గురువారం జ్ఞానేశ్వర్‌రావు కుమారుడు ఉమామహెశ్వర్‌రావు, కోడలు డాక్టర్‌ విజయలక్ష్మీ, కూమార్తెలు మహాలక్ష్మీ, నాగమణిలు తమ తండ్రి మృత దేహాన్ని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల వారికి అందజేశారు. వారు పార్ధీవ దేహాన్ని స్వీకరించినట్టు దృవీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అం దజేశారు. జ్ఞానేశ్వర్‌రావు కోరికను, అది మనస్పూర్తిగా తీర్చిన వారి కుటుంబ సభ్యులను అల్లం పాండురంగారావుతో పాటు స్థానికులు అభినందించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...