విద్యారంగంలో చేయూత నివ్వండి


Thu,May 16, 2019 11:43 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇండియా, ఇండోనేషియా దేశాల మధ్య విద్యారంగంలో క్రియాశీలక సహకారం ఉండాలని రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేషియా కాన్సుల్‌ జనరల్‌ అదీ సుకేందర్‌ అన్నారు. గురువారం ఇంగ్లీష్‌ అండ్‌ ఫారి న్‌ లాంగ్వేజస్‌ యూనివర్సిటీలో ఆయనతో పాటు మరో 9 మంది అధికారుల బృందంతో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సురేశ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా సుకేందర్‌ మాట్లాడు తూ.. ప్రత్యేక టీచర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇండోనేషియా దౌత్యవేత్తల నైపుణ్యానికి శిక్షణ, సాం స్కృతిక సంబంధాలు వృద్ధి చేసుకోవడంలో భాగంగా వర్సిటీకి వచ్చామన్నారు. ఇండోనేషియాకు చెందిన చాలా మంది విద్యార్థులు ఇండియాలోని పలు యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారని, ఇఫ్లూలోనే అనేకమంది ఇండోనేషియా విద్యార్థులు ఉన్నారని చెప్పారు. బృం దంలో యాది సురియహాది, సోయిమారాజంతో కార్లసెంటికా, పెర్రీసామ్యూల్‌ జాకబ్‌, రిజ్కి నోవిహమాజా తదితరులు ఉన్నారు. ఇఫ్లూ వీసీ సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రెం డేండ్లలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు, కోర్సు లు ప్రవేశపెట్టామని వివరించారు. ఇఫ్లూ అధికారులు ఇండోనేషియా విద్యార్థులకు పూర్తి సహకారం అందించడం పట్ల సుకేందర్‌ అభినందనలు తెలిపారు. రానున్నకాలంలో మరికొంతమంది ఇండోనేషియా విద్యార్థులు, టీచర్లు, దౌత్యవేత్తలను టీచర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు పంపిస్తామన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...