ఎస్‌ఆర్‌డీపీకి ఎన్నికల ఎఫెక్ట్‌


Thu,May 16, 2019 12:31 AM

-సొంతూళ్లకు ఇతర రాష్ర్టాల కార్మికులు
-తగ్గిన పనుల వేగం
-కోడ్‌తో నిలిచిన మరికొన్ని పనులు
-మూడు నెలలు దూరం జరిగిన గడువు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలోని ప్రధాన రహదారులను సిగ్నల్‌ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)పై ఎన్నికల ప్రభావం పడింది. ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు సొంత రాష్ర్టాలకు వెళ్లడంతో పనుల వేగం మందగించింది. దీంతో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు నిర్థారించిన గడువు దాదాపు మూడు నెలలకుపైగా దూరం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహనదారులు మరికొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో ఎక్కువగా ఒడిశా, చత్తీస్‌గడ్‌, బెంగాల్‌ తదితర రాష్ర్టాలకు చెందిన కార్మికులే కొనసాగుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో వివిధ దశల్లో పోలింగ్‌ జరుగుతుండడంతో రెండు నెలల కిందటే వారంతా తమ సొంత ఊర్లకు వెళ్లినట్లు, వారు తిరిగి వచ్చేసరికి మరో నెలరోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

అందుబాటులోకొచ్చిన ప్రాజెక్టులు....
-అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్‌- జనవరి 2018
- మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ అండర్‌పాస్‌ - ఏప్రిల్‌ 2018
- చింతలకుంట అండర్‌పాస్‌- మే 2018
- కామినేని ఎడమ వైపు ఫ్లైఓవర్‌- జూలై 2018
- మైండ్‌స్పేస్‌ ఫ్లైఓవర్‌- నవంబర్‌ 2018
- ఎల్బీనగర్‌ ఎడమవైపు ఫ్లైఓవర్‌- ఫిబ్రవరి-2019
- రాజీవ్‌గాంధీ విగ్రహం ఫ్లైఓవర్‌-ప్రారంభం- ఏప్రిల్‌ 2019
కొనసాగుతున్న పనులు, పూర్తిచేసేందుకు
..లక్ష్యం వివరాలు...
- బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌- మార్చి, 2019
-ఎల్బీనగర్‌ ఎడమవైపు(ఎల్‌హెచ్‌ఎస్‌) అండర్‌పాస్‌- డిసెంబర్‌, 2018(తుదిదశలో పనులు)
- బైరామల్‌గూడ ఎడమవైపు(ఎల్‌హెచ్‌ఎస్‌) ఫ్లైఓవర్‌- జూన్‌, 2019
- ఎల్బీనగర్‌ కుడివైపు(ఆర్‌హెచ్‌ఎస్‌) ఫ్లైఓవర్‌- మార్చి, 2019
- కామినేని కుడివైపు(ఆర్‌హెచ్‌ఎస్‌) ఫ్లైఓవర్‌- మార్చి, 2019
- దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి- రూ. 184కోట్లు - డిసెంబర్‌, 2019
- రోడ్‌ నం. 45 ఎలివేటెడ్‌ కారిడార్‌- రూ. 150కోట్లు - సెప్టెంబర్‌, 2019
పనులు ప్రారంభదశలో ఉన్న ప్రాజెక్టులు....
- షేక్‌పేట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌- రూ. 333.55కోట్లు - డిసెంబర్‌, 2019
- కొత్తగూడ గ్రేడ్‌ సెపరేటర్‌- రూ. 263.09కోట్లు - డిసెంబర్‌, 2019
- బాలానగర్‌ గ్రేడ్‌ సెపరేటర్‌- రూ. 387కోట్లు - సెప్టెంబర్‌, 2019
- ఒవైసీ వైద్యశాల, బహదూర్‌పురా ఫ్లైఓవర్‌- రూ. 132 కోట్లు - సెప్టెంబర్‌, 2019
- అంబర్‌పేట్‌ ఛే నెంబర్‌ ఫ్లైఓవర్‌- రూ. 270కోట్లు -డిసెంబర్‌, 2019
టెండర్‌ ప్రక్రియలో ఉన్న పనుల వివరాలు....
-ఇందిరాపార్కు-వీఎస్‌టీ స్టీలు బ్రిడ్జి- రూ. 426కోట్లు (టెండర్లు వచ్చాయి. పనులు ఖరారు చేయాల్సి ఉంది). - సైబర్‌ టవర్స్‌ ఎలివేటెడ్‌ రోటరీ ఫ్లైఓవర్‌- రూ. 225కోట్లు(అనుమతులు రావాల్సివుంది)-నానల్‌నగర్‌ ఫ్లైఓవర్‌- రూ. 175కోట్లు (టెండర్లు పూర్తి. మెట్రో రైలు ప్రతిపాదన మార్గం కావడంతో పెండింగ్‌).- శిల్పాలేఔట్‌-గచ్చిబౌలి ఫ్లైఓవర్‌- రూ. 330కోట్లు (టెండర్లు పూర్తి. మెట్రో రైలు ప్రతిపాదన మార్గం కావడంతో పెండింగ్‌). - నల్గొండ క్రాస్‌రోడ్‌-ఒవైసీ హాస్పిటల్‌ ఫ్లైఓవర్‌- రూ. 523.37కోట్లు(టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది). -జూపార్క్‌-ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌- 636.80కోట్లు(టెండర్లు ఖరారు. సర్వే పనులు షురూ). - చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ విస్తరణ- రూ. 37.00కోట్లు(టెండర్లు ఖరారు. సర్వే పనులు షురూ).- ఖాజాగూడ టన్నెల్‌, ఎలివేటెడ్‌ కారిడార్‌- రూ. 875కోట్లు(ప్రభుత్వ పరిపాలనా అనుమతి రావాల్సి ఉంది).- ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌- రూ. 311కోట్లు(టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది).

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...