మేమున్నామని..


Wed,April 24, 2019 12:31 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కుటుంబం.. బహిరంగ ప్రదేశాలు..పని చేసే చోట..ఇలా ఎక్కడైనా సరే స్త్రీకి అవమానం జరిగినా, ప్రతిష్టకు భంగం కలిగినా, లైంగిక దాడికి పాల్పడ్డా, యత్నించినా, గృహహింసకు గురైనా వారిగా అండగా సైబరాబాద్ భరోసా కేంద్రం నిలబడుతుంది. ఈ కేంద్రంలో లభిస్తున్న వివిధ విభాగాల ఏకీకృత సేవలతో చాలా మంది దంపతుల్లో నెలకొన్న విబేధాలు తొలిగిపోయి తిరిగి ఒకటవుతున్నారు. మోసం చేసిన వారిని జైలుకు పంపుతున్నారు. మద్యానికి బానిసైన వారిని తాగుడు మాన్పించి ఆ కుటుంబాల్లో వెలుగును నింపుతున్నారు. లైంగిక దాడులకు గురవుతున్న బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలతో పాటు బాధితుల్లో నెలకొన్న కలవరం, ఆవేదనను తొలగించి వారికి సరికొత్త భవిష్యత్తును అందిస్తున్నారు. ఇలా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ భరోసా కేంద్రంలో గృహహింస, లైంగిక దాడులు, యత్నాలు మొత్తం 376 కేసులను నమోదు చేసి బాధితులకు భరోసాను ఇచ్చారు. దీంతో భరోసా కేంద్రంలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కేంద్రం సేవలను పొందిన పలు సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.

పెండ్లి-సహజీవనం..
మాదాపూర్ ప్రాంతంలో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న యువతి మరో ఐటీ ఉద్యోగితో 8 ఏండ్ల నుంచి సహజీవనం చేస్తుంది. అయితే అతడు పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో సహజీవనానికి ఒప్పకుంది. ఇలా సహజీవనంలో ఆ ఐటీ ఉద్యోగిని గర్భం దాల్చింది. అతడి ఒత్తిడితో అబార్షన్ చేయించుకుంది. అతడికి మరో ఐటీ ఉద్యోగినితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని అతడిని పెండ్లి కోసం నిలదీసింది. అతడు నిరాకరించడంతో యువతి భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో భరోసా కేంద్రం అధికారులు మోసం చేసిన వ్యక్తిని పిలిపించి మాట్లాడారు. అతడు యువతి చేసిన సహజీవనం, అబార్షన్‌ల వ్యవహరాన్ని ఒప్పకున్నాడు. కానీ వివాహం చేసుకోనని తేల్చిచెప్పాడు. ఫిర్యాదుకు భరోసా కేంద్రం ద్వారా సహకారం తీసుకున్న యువతి అతడిపై మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి చర్యలను తీసుకున్నారు.

తాగుబోతు భర్తను మార్చారు..
గచ్చిబౌలీ ప్రాంతానికి చెందిన ఓ గృహిణి భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. కారు డ్రైవర్ అయిన భర్త ప్రతి రోజు మద్యం మత్తులో పిల్లలతో పాటు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ ఫిర్యాదుపై భార్యాభర్తలను పిలిపించి వారికి నిపుణులతో కౌన్సెలింగ్‌ను ఇప్పించారు. భర్త మద్యం అలవాటు నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ వర్క్‌షాపు ద్వారా అవగాహన కల్పించారు. దీంతో 10 రోజుల తర్వాత తిరిగి డీ అడిక్షన్ వర్క్‌షాపునకు హాజరై మద్యం తాగడాన్ని బంద్ చేశాడు.
సహజీవనానికిదూరంగా ఉండండిభరోసా కేంద్రానికి అధికంగా సహజీవనానికి సంబంధించిన ఫిర్యాదులు, ప్రేమ, పెండ్లి పేరుతో లక్షలాది రూపాయల ను దోచుకుంటు న్న సంఘనలపై కేసు లు వెలువెత్తున్నాయి. దీంతో భరోసా కేంద్రం అధి కారులు యువతులకు సహజీవనానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...