పకడ్బందీగా పరిషత్ నిర్వహణ


Tue,April 23, 2019 02:53 AM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ : జిల్లాలో మూడు విడుతలుగా జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ తెలిపారు. లక్డీకాపూల్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వచ్చేనెల 6,10,14 తేదీల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగనుందన్నారు. మొదటి విడుతలో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 7 మండలాల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. రెండో విడుతలో (నందిగామ,కొత్తూరు, ఫరూఖ్‌నగర్, కేశంపేట్,కొందుర్గు, చౌదరిగౌడ, కందుకూరు, మహేశ్వరం)ఎన్నికలు జరిగే 8 మండలాలకు సంబంధించి నామినేషన్లను ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడో విడుత జరిగే మిగతా 6(అమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, శంషాబాద్, మాడ్గుల,యాచారం) మండలాల్లోని ఎంపీటీసీ,జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 30 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా మూడు విడుతలకు సంబంధించి 1,433 పోలింగ్ కేంద్రాలు.. 582లోకేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఈనెల 18న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మరో విడుత శిక్షణ ఈనెల 30న ఉంటుందన్నారు. 1,433 పోలింగ్ కేంద్రాల్లో 400 కేంద్రాలు సమస్యత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. వీటిలో 131 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడం జరిగిందన్నారు. సమస్యత్మక కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించడంతో పాటు పటిష్టమైన రాష్ట్ర బలగాల బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండల,జిల్లా పరిషత్‌లకు సంబంధించి 18లక్షల బ్యాలెట్ పత్రాలు ప్రిటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు 9లక్షలు, ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు 9లక్షలు ప్రింటింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
పాల్మకుల స్ట్రాంగ్ రూంల పరిశీలన

శంషాబాద్ మండల పరిధిలో పాల్మకుల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్న పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంల స్ట్రాంగ్‌రూంలను జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, వివిధ పార్టీల అభ్యర్థులు పరిశీలించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...