యూపీఎస్సీ పరీక్షల్లో మార్పులు


Sun,April 21, 2019 12:58 AM

- నేడు ఎన్‌డీఏ-ఎన్‌ఏ రాత పరీక్ష
- 10 నిమిషాల ముందుగా వస్తేనే అనుమతి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారు కాస్త జాగ్రత్త సుమా. తీరిగ్గా పరీక్షా సమయానికి సెంటర్‌కు వెళతామనుకుంటే కుదరదు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇలా వచ్చిన వారిని మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు. ఏ మాత్రం ఆలస్యమైనా.. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. ఇది వరకు పరీక్ష సమయం వరకు అభ్యర్థులను అనుమతించగా, తాజాగా 10 నిమిషాల ముందు వరకే అనుమతిస్తామని యూపీఎస్సీ వర్గాలు తాజాగా ప్రకటించాయి. పది నిమిషాల ముందు యూపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు ఇదే నిబంధన వర్తిస్తుందని, కనుక అభ్యర్థులు జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.

నేడు ఎన్‌డీఏ పరీక్ష...
యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) నేవీ అకాడమీ(ఎన్‌ఏ)లో పలు పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 11,628 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణపై జిల్లా సంయుక్త కలెక్టర్ గుగులోతు రవి శనివారం సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్లను ఫ్లయింగ్ స్కాడ్‌గా నియమించి పరీక్షను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...