హనుమాన్ విగ్రహ నిర్మాణంలో


Sat,April 20, 2019 12:59 AM

- ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
శంషాబాద్ : భగవంతుని ఏ కార్యక్రమంలోనైనా ప్రతిఒక్కరూ భాగస్వాములై తరించాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ఉద్బోధించారు. శుక్రవారం హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా శంషాబాద్ మండలం ప్రసిద్ధ అమ్మపల్లి దేవాలయం ఎదుట 40 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణదాత నర్కుడ మాజీ ఎంపీటీసీ బుక్క వేణుగోపాల్, సుచరిత దంపతులు చేపట్టిన విగ్రహ నిర్మాణానికి చినజీయర్ స్వామి ముఖ్యఅతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా భూమిపూజ గావించారు. ఈ సందర్భంగా స్వామి తమ వంతుగా విగ్రహ నిర్మాణానికి రూ.50 వేల విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో స్వామి ముందుగా అమ్మపల్లి శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ ఘనంగా స్వాగతం పలికారు. భారీ విగ్రహ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత బుక్క వేణుగోపాల్, సుచరిత దంపతులను అభినందించి ఆయనతోపాటు కుటుంబీకులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహ నిర్మాణ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి మాట్లాడారు. మానవ జన్మలో సంపదలు, భౌతిక సుఖభోగాలు శాశ్వతం కాదని, ధార్మిక, సామాజిక సేవలతోపాటు పరోపకారం, భగవతారాధనతో సమాజ శ్రేయస్సు, సమసమాజ నిర్మాణం సుసాధ్యమని తెలిపారు. విగ్రహ నిర్మాణంలో ప్రతిఒక్కరూ తమ వంతుగా ఒక్కో ఇటుక సమర్పించి భక్తి చాటుకోవాలని సూచించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో స్వామీజి మార్గదర్శకంలో నాలుగు నెలల్లో విగ్రహం పూర్తికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భజన మండలి భక్తితన్మయత్వంలో ముంచెత్తారు. కార్యక్రమంలో అమ్మపల్లి ఆలయ ఫౌండర్‌ట్రస్టి వినోద్‌కుమార్, నర్కుడ సర్పంచ్ సిద్దులు, ఎంపీటీసి లతాశ్రీనివాస్, జడ్పీటీసి సతీష్, నీరటి రాజు, అశోక్, భిక్షపతి, యాదగిరి, కృష్ణ, నగేశ్, శేఖర్‌యాదదవ్, కుమార్, కిట్టుతో పాటు పలువురు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...