పాఠశాలల ఎంపికపై జాగ్రత్త


Thu,April 18, 2019 01:00 AM

- హైదరాబాద్ ఆర్జేడీ విజయలక్ష్మి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ గుర్తిం పు ఉన్న బడుల్లో చదివిస్తేనే.. పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని పాఠశాల విద్య హైదరాబాద్ ప్రాం తీయ సంయుక్త సంచాలకులు విజయలక్ష్మి అన్నారు. అడ్మిషన్ల సమయంలో తొందరపడకుండా ఏ పాఠశాలకు గుర్తింపు ఉంది?, ఏ పాఠశాలకు లేదోనని పరిశీలించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని తెలిపారు. గుర్తింపు లేకుండా కొనసాగే పాఠశాలలపై ఫిర్యాదు అం దిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేటర్ పరిధిలో రెండు ప్రైవేటు పాఠశాలలను మూసివేశామన్నారు. పాఠశాలలో ఉత్తమ ఫ్యాకల్టీ, వసతులు అంశాలను పరిశీలించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో వాటిని గుర్తించినా.. పిల్లలను వెనక్కి తీసుకోలేకపోతామని, ముందుగానే వాటిని గుర్తించాలని కోరా రు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు పాఠశాలలకు విద్యాహక్కు చట్టం ప్రకారమే పర్మిషన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించొద్దని, అలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలలు జారీ చేసే నోటిఫికేషన్ల ఆధారంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు అడ్మిషన్ తీసుకోవాలని, ఎవరూ తొందరపడి అడ్మిషన్ల కో సం ప్రైవేటు పాఠశాలల చుట్టూ తిరగొద్దని కోరారు. ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ విద్య అందుతోందని, కార్పొరేట్ స్థాయి బోధనతో పాటు సకల వసతులు కల్పిస్తున్నామని చెప్పా రు. ఉచితంగా పుస్తకాలు, దుస్తులను అందించడంతో పాటు రుచికరమైన మధ్యాహ్నా భోజనా న్ని అందిస్తున్నామని తెలిపారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...