ఎండలోనూ.. వానలోనూ.. పనిచేసేది ట్రాఫిక్ పోలీసులే


Thu,April 18, 2019 12:59 AM

- వాళ్లే నగర పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లు : సీపీ అంజనీకుమార్
- చలువ కండ్లద్దాలు, మజ్జిగ ప్యాకెట్లతో సమ్మర్ కిట్స్ పంపిణీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎండలు, వానలు, చలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టిపెడుతూ విధి నిర్వహణ చేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ సిటీ పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఎండలు ఎక్కువ కావడంతో విధి నిర్వహణలో ఉండే ట్రాఫిక్ పోలీసులకు మంచినీళ్ల బాటిల్, బటర్ మిల్క్ ప్యాకెట్, మాస్క్, గాగుల్స్, విఫెల్టెట్ జాకెట్, గ్లూకోన్-డీ, కూలర్ లైట్ తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్‌లను పంపిణీ చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బందికి సీపీ ఈ కిట్లను బుధవారం పంపిణీ చేశారు. నగరంలో ఉన్న 2,400 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. సంవత్సరాంతం రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ నగరంలో 86 లక్షల మందికి తమ వంతు సహాయాన్ని ట్రాఫిక్ విభాగం అందిస్తుందని కొనియాడారు.

ట్రాఫిక్ విభాగంలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు, సిబ్బంది కృషితో రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ, రోడ్డు సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా వంటి మహానగరాల కంటే హైదరాబాద్ రోడ్లపై సురక్షితమైన ప్రయాణం చేయవచ్చని నగర ట్రాఫిక్ పోలీసులు నిరూపిస్తున్నారని, ఇందుకు ప్రజల సహాయం ఎంతో ఉందన్నారు. ప్రజల సహకారంతో భవిష్యత్తులో హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించడంతోపాటు రోడ్డు భద్రత ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తామని సీపీ అన్నారు. నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు ఎల్‌ఎస్ చౌహాన్, బాబురావు, అదనపు డీసీపీలు ఎ.భాస్కర్, పి.కరుణాకర్‌లతోపాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...