నిర్లక్ష్యంగా.. ప్రమాదకరంగా..


Thu,April 18, 2019 12:58 AM

- పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో బయటపడిన ఉల్లంఘనలు
- కౌన్సెలింగ్ ఇచ్చినా... మారని యాజమానులు, డ్రైవర్లు
- 26 లారీలు సీజ్.. డ్రైవర్లపై కేసులు
- నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఫొటో తీసి... ట్రాఫిక్ వాట్సాప్‌కు పంపండి
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అతివేగంగా, ఇష్టానుసారంగా వెళ్లే లారీలు, టిప్పర్లపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రహదారులపై ప్రమాదకరంగా బండరాళ్లు, నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న లారీలు, టిప్పర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం మాదాపూర్ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్లక్ష్యంగా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రాత్రి సమయాల్లో ప్రమాదకరంగా వెళ్తున్న 26 లారీలు, టిప్పర్లను స్వాధీనం చేసుకుని, డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఈ లారీల డ్రైవర్లలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవని తేలిం ది. వాహన డ్రైవర్లు తమ ఉల్లంఘనలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా నంబర్ ప్లేట్లను కనిపించకుండా పెడుతున్నారని ఈ డ్రైవ్‌లో బయటపడింది.

యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు..
వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గతంలో పలుమార్లు నిర్మాణాలు చేపడుతున్న యాజమాన్యాలు, వర్క్ కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు , లారీ, టిప్పర్ల డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదని తాజాగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో స్పష్టమైంది. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మరో సారి ఈ నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే సమాచారం ఇవ్వండి
పౌరులు కూడా తమ బాధ్యతగా ఇలాంటి నిర్లక్ష్యం, ఉల్లంఘనలు కనిపించినప్పుడు వెంటనే ఫొటో తీసి సైబరాబాద్ ట్రాఫిక్ వాట్సాప్ నం.9490617346 పంపించాలని సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు. రోడ్లపై వాహనదారులు, పాదచారుల రక్షణ మనందరీ బాధ్యతగా గర్తించి... ఉల్లంఘనలు కనపడితే వెంటనే జస్ట్ క్లిక్‌చేసి మాకు పంపించండి....ఆ తర్వాత మేం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...