మానసిక విద్యార్థినికి.. వైద్యం అందించిన కస్తూర్బా ట్రస్ట్


Tue,April 16, 2019 11:58 PM

బండ్లగూడ, ఏప్రిల్ 15 : మానసిక స్థితి బాగా లేక రోడ్డుపై తిరుగుతున్న ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థిని పోలీసులు కస్తుర్బా ట్రస్ట్‌లో చేర్పించి రెండు సంవత్సరాలు వైద్య సేవలు అందించి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమె కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించనున్నారు. వివరాలలోకి వెళి తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బనారస్‌కు చెందిన అనిల్ కుమార్ మధ్యప్రదేశ్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తుండగా కూమార్తె సునంద సాయిని మోయినాబాద్‌లోని వీఆర్‌కే మెడికల్ కళాశాలలో 2010 నుంచి 2015 వరకు ఎంబీబీఎస్ చదివించారు. సునందసాయి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న అనంతరం ఆమె స్వగ్రామమైన బనారస్‌కు వెళ్లింది. 2017 సంవత్సరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకునేందుకు నగరానికి చేరుకుంది. నగరానికి చేరుకున్న ఆమె మానసిక స్థితి సరిగా లేక రోడ్డుపై తిరుగుతుండడాన్ని గుర్తించిన నాంపల్లి పోలీసులు 2017లో ఆమెను హైదర్షాకోట్‌లోని కుస్తుర్బా ట్రస్టులో చేర్పించారు. అప్పటి నుంచి ట్రస్ట్ నిర్వాహకులు ఆమెకు 18 నెలలుగా వైద్యం అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు సునంద సాయి మేనత్త అల్కారాయ్ ఆదివారం కస్తుర్బాట్రస్టుకు వచ్చి సునంద సాయిని గుర్తు పట్టారు. మంగళవారం పోలీస్ ఉన్నాతాధికారుల సమక్షంలో సునంద సాయిని అప్పగించనున్నట్లు కస్తుర్బా ట్రస్ట్ మెనేజర్ మూర్తి తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...