నిబంధనల అతిక్రమణ.. జరిమానా..


Tue,April 16, 2019 11:56 PM

మాదాపూర్: చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్ జీహెచ్‌ఎంసీ నిబంధనలను అతిక్రమించి పబ్లిసిటీలో భాగంగా ఎల్‌ఈడీ హోర్డింగ్‌లను ప్రదర్శించడంతో సర్కిల్ ఉప కమిషనర్ తన సిబ్బందితో కలిసి సోమవారం నిర్వాహకులకు నోటీసులను జారీ చేయడంతో పాటు జరిమానాలను విధించారు. ఇందులో భాగంగా చందానగర్ పరిధిలో ఉన్న కేఎల్‌ఎం, మాంగళ్యషాపింగ్ మాల్‌కు రూ. 50 వేల చొప్పున జరిమానాలను విధించారు. అనంతరం మాదాపూర్‌లోని మెహిఫిల్ రెస్టారెంట్ ఎల్‌ఈడీ హోర్డింగ్‌ను ప్రదర్శించడంతో రూ. 10వేలను జరిమానా విధించారు. ఈ సందర్భంగా చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ యాదగిరిరావు మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న షాపింగ్ మాల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చిన షాపింగ్‌మాల్స్ నిర్వాహకుల వైఖరిని మార్చుకోకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవి, శానిటేషన్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఏఈ అభిలాష్‌లు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...