ఘన వ్యర్థాలపై సమరం


Tue,April 16, 2019 11:55 PM

-వ్యర్థాల నిర్వహణపై పీసీబీ దృష్టి
-జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలతో ముందడుగు
-పర్యవేక్షణకు ప్రత్యేక జడ్జితో కమిటీ నియామకం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో వెలువడుతున్న సాలిడ్‌వేస్ట్(ఘనవ్యర్థాల) నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టారు. దుర్గంధానికి, వ్యాధులకు కారణమవుతున్న ఘన వ్యర్థాలను తొలిగించే నిర్వహణపై దృష్టిసారించారు. జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బోర్డు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. వ్యర్థాల నిర్వహణను పర్యవేక్షించేందుకు జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో కమిటీని నియమించి, తరుచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.
ఎన్‌జీటీ ఆదేశాలు - అమలు
- ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
- జిల్లా కలెక్టర్ ప్రతి నెలా తమ పరిధిలో వెలువడుతున్న ఘన వ్యర్థాల నివేదికను తయారుచేసి, రాష్ట్రస్థాయి కమిటీకి అందజేయాలి.
- సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రస్తుతం అమలుచేస్తున్న ప్రణాళిక, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళికలను జిల్లా కలెక్టర్లు సమర్పించాలి
- జిల్లా స్థాయిలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, పీసీబీ ప్రాంతీయ అధికారి సభ్యులుగా ఉండాలి.
-జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నామినేట్ చేసిన సభ్యులు సైతం కమిటీలో ఉండాలి.
- విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, స్థానిక ఎకోక్లబ్స్‌ను భాగస్వామ్యం చేసి, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాలు -2016పై అవగాహన కల్పించాలి.
- మోడల్ సిటీ, నగరాలను తీర్చిదిద్ది ఆదర్శంగా నిలువాలి.
వ్యర్థాల సేకరణ ఇలా..
- ఎంఎస్‌డబ్యూ మేనేజ్‌మెంట్ -2000 నిబంధనల ప్రకారం చెత్తను సేకరిం
చాల్సిన బాధ్యత ఆయా స్థానిక సంస్థలదే. చెత్తను సేకరించడంతో పాటు చెత్త
రవాణా, వేరుపరచడం, ప్రాసెసింగ్ బాధ్యతలన్నీ స్థానిక సంస్థలే చేపట్టాలి.
-వ్యర్థాలతో వాతావరణ కాలుష్యం వెదజల్లడాన్ని అరికట్టాలి.
-నిర్జన ప్రదేశాల్లో చెత్త, కుళ్లిన ఎండిపోయిన ఆకులను కాల్చడం పూర్తిగా నిషేధం
- మురికివాడలు, బస్తీలు, గుడిసెలు, హోటళు, రెస్టారెంట్లు, కార్యాలయాలు,
కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి చెత్త సేకరించడం తప్పనిసరి.
- చెత్తను తరలిస్తున్నప్పుడు పాలిథిన్ కవర్లతో కప్పి మాత్రమే తీసుకెళ్లాలి.
- ప్రతీరోజు మానవరహితంగా చెత్తను సేకరించాలి. యంత్ర సామగ్రిని ఇందుకోసం వినియోగించాలి. సేంద్రీయ వ్యర్థాలు బయో డిగ్రిడేబుల్ వ్యర్థాలను వేర్వేరుగా డబ్బాల్లో సేకరించాలి.
- వ్యర్థాల సేకరణ కోసం మూడు డబ్బాలను ఏర్పాటు చేయాలి. బయోడిగ్రేడెబుల్ వ్యర్థాల కోసం ఆకుపచ్చ, సేంద్రీయ వ్యర్థాల కోసం తెలుపురంగు, ఇతర వ్యర్థాల కోసం నలుపురంగు డబ్బాలను ఏర్పాటుచేయాలి.
- నిర్మాణ వ్యర్థాలు, కూల్చివేసిన వ్యర్థాలను వేర్వేరుగా నిబంధనల మేరకే సేకరించాలి. జీవ వ్యర్థాలను సైతం వేర్వేరుగానే సేకరించాలి.
శుద్ధి చేయడం ఇలా..
- శుద్ధి కోసం వేస్ట్‌మేనేజ్‌మెంట్ హ్యాండ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి
- సేకరించిన చెత్త నుంచి మొదటగా.. పునర్వినియోగ వస్తువులను శుద్ధి చేయడానికి ముందే రికవర్ చేయాలి.
- సేంద్రీయ వ్యర్థాలను శుద్ధికి ముందే వర్మీ కంపోస్ట్‌గా మలచాలి.
- వినియోగించడానికి వీలులేని చెత్తను డిస్పోజ్ చేయడానికి ల్యాండ్‌ఫిల్ సౌకర్యాలను ఏర్పాటుచేయాలి.
- గరిష్టంగా 25 ఏండ్ల పాటు ఈ ల్యాండ్‌ఫిల్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
- డంపింగ్‌యార్డులు, వేస్ట్ మేనేజ్‌మెంట్ హ్యాండ్లింగ్ యూనిట్లు పరిసరాల్లో భూగర్భ, మిగులు జలాలు, వాయువుల నాణ్యత పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...