నగరంలో ఆర్టీసీ బిజినెస్ సెంటర్లు


Sat,April 13, 2019 02:56 AM

-ఖాళీ స్థలాల్లో పీపీపీ పద్ధతుల్లో నిర్మాణాలకు త్వరలో టెండర్లు
సిటీబ్యూరో. నమస్తే తెలంగాణ : టీఎస్ ఆర్టీసీకి చెందిన డిపోలు, స్టేషన్ల పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఆర్టీసీ భారీ భవన నిర్మాణాలను చేపట్టనున్నది. సినిమాలు, షాపింగ్ మాల్స్ నిర్మించనున్నారు. రవాణేతర ఆదాయంపై దృష్టి సారించిన టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం బిజినెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటన్నింటినీ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) విధానంలో నిర్మించాలని నిర్ణయించారు. ఎంజీబీఎస్ స్టేషన్ సమీపంలో హ్యాంగర్ బస్‌స్టేషన్‌ను పీపీపీ పద్ధతిలో నిర్మించి ఇదే విధానాన్ని మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నగర డిపోలు, స్టేషన్లతోపాటు ఖాళీగా ఉన్న ప్రాంతాలను సేకరిస్తున్నారు. విస్తీర్ణం, వ్యాపార అవకాశాలపై దృష్టి సారించారు. ప్రతీ బిజినెస్ సెంటర్‌ను 4 నుంచి 5 అంతస్తుల్లో నిర్మించి క్రింది రెండంతస్తులు ఆర్టీసీ అవసరాల కోసం ఉపయోగించుకుని మిగతా వాటిని వ్యాపారాలకు అప్పగించాలని భావిస్తున్నారు. ముందుగా సీబీఎస్ బస్‌స్టేషన్‌ను నిర్మించి అదే మోడల్‌లో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని, అందుకోసం టెండర్లు పిలువాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...