పిల్లల్లో నైపుణ్యాలకు బ్రిటిష్ కౌన్సిల్ పాఠాలు


Sat,April 13, 2019 02:55 AM

-ఐదు రోజులు 10 గంటల పాటు నిర్వహణ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వేసవిలో పిల్లల్లో సృజనాత్మకత, క్లిష్టమైన ఆలోచనలు, సమస్యల పరిష్కారం, సంభాషణ నైపుణ్యాలు, విశ్వాసం పెంచుకోవడం, సరదాగా ఉండడం వంటి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు బ్రిటిష్ కౌన్సిల్ ఇంటరాక్టివ్ పాఠాలను బోధించనున్నది. 21వ శతాబ్ధపు పిల్లలకు కావాల్సిన నైపుణ్యాలను అనుభవజ్ఞులైన అభ్యాసకులతో బోధించేందుకు ప్రత్యేకంగా రూపొందించింది. ఆంగ్లభాషా శిక్షణతో పదవినోదం, థీమ్ ఆథారిత కార్యక్రమం, సృజనాత్మకతను పెంచుకుని మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ పాఠాలు ఉపయోగపడనున్నాయి. ఈ కోర్సుల్లో డిజిటల్ లెర్నింగ్, పబ్లిక్ స్పీకింగ్, సృజనాత్మక రచన, చిత్రాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రత్యేక యంగ్ లెర్నర్ టీచింగ్ పద్ధతిలో పాఠాలు ఉండనున్నాయి. ఇదిలావుంటే.. 70 ఏండ్లుగా బ్రిటిష్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ నిపుణులతో ఉత్తమమైన ఇంగ్లిష్ కోర్సులు, వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తరగతులను ఏడేండ్ల పిల్లల నుంచి 14ఏండ్ల వయసు వారికి ఐదు రోజుల్లో 10 గంటలపాటు పాఠాలు బోధించనున్నారు. అయితే ఆయా ఏండ్ల వారికి ఈనెల 23 నుంచి మే 18వ తేదీ వరకు వేర్వేరుగా తరగతులు కొనసాగుతాయి. కోర్సు ఫీజు లైబ్రరీ మెంబర్లకు రూ.4వేలు, నాన్‌లైబ్రరీ మెంబర్లకు రూ.5,500 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893499722 నంబర్‌లో సంప్రదించవచ్చు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...