ఏడుపుతో మానసిక ఒత్తిడి దూరం


Mon,March 25, 2019 03:11 AM

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: మనసులో బాధ కలిగినప్పుడు సాధారణంగా ఏడుపు వస్తుంది. కాని ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ బాధను మనసులో దాచుకుంటున్నారు. ఏడవడానికి సంశయిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు జీవన విధానం కూడా మారుతుంది. ఈ క్రమంలో ఏడవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోతోంది. బాధను మనసులో దాచుకోవడం వల్ల అది మానసిక ఒత్తిడిగా మారి హార్ట్‌ఎటాక్‌లకు దారితీస్తుంది. మరికొందరిలో ఆత్మహత్యలకు దారితీస్తుంది. బీపీ, షుగర్ వంటి రోగాలకు దారితీస్తుంది. ఇలాంటి వాటినుంచి తప్పించుకుని బయటపడి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం నెలలో ఒక్కసారైన మనసులో ఉన్న బాధలన్నీ బయటకు వెల్లదీసి మనసారా ఏడవాలి. ఆ విధంగా ఏడవడమే క్రైయింగ్ థెరపీ...అని క్రైయింగ్ థెరపీ క్లబ్ ఫౌండర్ కమలేశ్ మసా లవాల అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ గార్డెన్‌లో ఏబీసీ లాఫింగ్ అండ్ క్రైయింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైయింగ్ క్లబ్ ప్రారం భోత్సవానికి ముఖ్య అతిథిలుగా పద్మశ్రీ డా.సాయిబాబాగౌడ్, డా.ఏకె. పురోహిత్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలేశ్ మాట్లాడుతూ 2017 లో ఈ క్రైయింగ్ క్లబ్‌ను మొదటి సారిగా గుజరాత్‌లోని సూరత్‌లో ప్రారం భించామన్నారు.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను ఆత్మహత్యల రహిత నగరాలుగా మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ క్రైయింగ్ క్లబ్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మనిషి ఏడ్చుకుంటూనే జన్మిస్తాడని అలాంటప్పుడు ఏడవ డానికి సిగ్గుపడాల్సిన పనిలేదన్నారు. ఏడవడం వల్ల ఎన్నో రోగాలు మాయ మవుతాయన్నారు. ముఖ్యంగా మనసు లోని బాధ తగ్గి మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. 90శాతం రోగాలకు మానసిక ఒత్తిడే కారణమన్నారు. సాధా రణంగా ఇళ్లలో అత్తలు, కోడళ్లు, కుమారులు, పిల్లలు ఇలా రకరకాల వారు పలు రకాల కారణాలతో బాధను మనసులో దాచుకుని, లోలోన కుమిలిపోవడం జరుగుతుందన్నారు. దీనివల్ల మానసిక వత్తిడి తీవ్రమై గుండెపోటురావడం, బీపీ పెరగడం వంటి భయానక రోగాల బారిన పడి ప్రాణాలు వదులుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా కొంతమంది మానసిక వత్తిళ్లకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కమలేశ్ వాపోయారు. మనసులోని బాధను వెళ్లగక్కడానిక ఏడుపు అనేది ఒక మార్గమని, ఈ మార్గం ద్వారా మనసును ఒత్తిడి నుంచి కాపాడుకోవచ్చన్నారు. క్రైయింగ్ థెరపీ వల్ల రోగాలు దూరమవడంతో పాటు కళ్లు, ముక్కు శుభ్రమవుతాయన్నారు.

ప్రతి నెలా ఆఖరి ఆదివారం....
ప్రతినెల ఆఖరి ఆదివారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ గార్డెన్‌లో ఉదయం 8.30.గంటల నుంచి 9.30గంటల వరకు క్రైయింగ్ క్లబ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా నగరంలోని 27లాఫింగ్ క్లబ్‌లలో సైతం క్రైయింగ్ థెరపీ నిర్వహించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని జీరో సూసైడ్ సిటీగా మార్చడమే తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏబీసి లాఫింగ్ అండ్ క్రైయింగ్ క్లబ్ చైర్మన్ సత్యనారాయణ, అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...