వెబ్‌కాస్ట్ వలంటీర్లకు అవకాశం


Mon,March 25, 2019 03:11 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వెబ్‌కాస్ట్ వలంటీర్ల రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు. వలంటీర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్ధులు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ లేదా మైజీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా లింకుద్వారా ఎన్ రోల్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అడి షనల్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెబ్ కాస్ట్ వలంటీర్లుగా పనిచేసే వారెవ్వరైనా స్వంత ల్యాప్‌టాప్ పట్టుకుని రావాలని, గౌరవ వేతనంతోపాటు సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. దీనికి సంబంధించి శిక్షణ ఇస్తామని తేదీ త్వరలో తెలి యచేస్తామని చెప్పారు.. వివరాల కోసం electionswebcosti ng2019@gmail.com ను సంప్రదించాలని కోరారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...