మెజార్టీయే లక్ష్యం..


Sun,March 24, 2019 02:30 AM

- చేవెళ్లలో ప్రణాళికతో ప్రచారం
- కార్తీక్ రెడ్డి చేరికతో టీఆర్‌ఎస్ మరింత పటిష్టం
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ పోరులో విజయమే లక్ష్యంగా గులాబీ దూకుడు పెంచింది. ఈ సారీ అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఫలితాలు పునరావృతమయ్యేలా కసరత్తు చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించింది. పార్టీ అధిష్టానం కూడా చేవెళ్ల పార్లమెంట్‌ను కీలకంగా తీసుకుంది. జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఉన్న పాత, కొత్త టీఆర్‌ఎస్ క్యాడర్‌ను ఒకేతాటిపై నడిపించేందుకు అడుగులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లుతున్నారు. ఇప్పటికే చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగా.. ప్రచార పర్వానికి గులాబీ సైన్యం సిద్ధమయ్యింది. ఎమ్మెల్యేల బృందం కార్యాచరణతో ముందెకెళ్తుంది.

గతంలో లేని విధంగా..
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గతంలో ఎప్పుడూ లేనంత మెజార్టీ సాధనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశాలతో పార్టీ నేతలు దూకుడు పెంచనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ ప్రకారం అందరికీ కలిపి దాదాపు 2 లక్షల మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీని 4 లక్షలు దాటించాలని నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు వేస్తున్నారు.

భారీ మెజార్టీకి ప్రణాళికలు..
లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం దాదాపు ఖాయం కాగా..భారీ మెజార్టీపైనే నాయకులు దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

విజయం నల్లేరుపై నడకే..
మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి,ఆనంద్, కాలె యాదయ్య, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌లు సంయుక్తంగా చేవెళ్ల లోక్‌సభపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ప్రకటిస్తున్నారు. ఇటీవల మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పట్లోళ్ల కుటుంబం టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో చేవెళ్ల గెలుపు సునాయసనమే అంటున్నారు విశ్లేషకులు. నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ బుద్వేల్‌లలో ఐటీ పరిశ్రమలు, గండిపేట్, హిమాయత్‌సాగర్ జంట జలాశాయాలు పర్యాటక కేంద్రాలుగా రూపంతరం చెందబోతున్నాయి. మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ పరిశ్రమతో స్థానిక యువతకు ఉద్యోగాలు రానున్నాయి. ఇవన్నీ టీఆర్‌ఎస్ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చుతున్నాయి.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...