నైపుణ్యతతోనే ఉద్యోగ అవకాశాలు


Sat,March 23, 2019 03:01 AM

ఘట్‌కేసర్ : ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యతను, సృజనాత్మకతను వెలికితీయడానికి జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని భారత ప్రభుత్వ ఎస్‌ఈఆర్‌బీ, డీఎస్‌టీ కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి టెక్నికల్ కల్చరల్ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జరిగిన సమావేశంలో రాజీవ్ శర్మ మాట్లాడుతూ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగకరమైనవిగా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా డాటాసైన్, ఆర్టిఫిషియల్, ఇంటలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్ లాంటి అంశాల్లో నైపుణ్యత సాధించినట్లయితే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. జాతీయ స్థాయి ఫెస్ట్‌ల ద్వారా టెక్నాలజీహెడ్ డిజిటల్ ఇనిషియేట్స్ వంటి వాటిని పెంపొందించుకోవాలన్నారు. కళాశాల డైరక్టర్ మాట్లాడుతూ సదస్సుకు 150 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరై 120 విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ ప్రిన్సిపాల్ పెద్దిగారి బాల ప్రసాద్, క్యూ లింక్ టెక్నాలజీ అకాడమిక్ పోగ్రాం మేనేజర్ ఎం. పంకజ్, కళాశాల డిప్యూటీ డైరక్టర్ జి. విష్ణుమూర్తి, సముహ క్రియేషన్స్ వ్యవస్థాపకులు ప్రశాంత్ అరుణ సాయి, కళాశాల డీన్ ఎం. ముత్తారెడ్డి, వి. విజయకుమార్, వసుధ భక్షి, పోగ్రాం కో కన్వీనర్ పి. రవీందర్‌రావు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...