మిగిలింది రెండు రోజులే..


Fri,March 22, 2019 04:09 AM

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్లు ప్రారంభమై మూడు రోజులు పూర్తయినప్పటికీ ఒకే ఒక వ్యక్తి రెండు నామినేషన్ సెట్ దాఖలు చేశారు. సోమవారం ప్రారంభమైన నామినేషన్లు ఈ నెల 25న ముగుస్తాయి. పోటీ చేయాల్సిన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయవచ్చు. 21, 23, 24 తేదీల్లో సెలవులు ఉండడంతో కేవలం రెండు రోజులు మాత్రమే నామినేషన్లు వేయడానికి సమయం ఉంది. ఇప్పటికే హోలీ పండుగ సెలవు పూర్తి కాగా 23, 24 తేదీలు (శని, ఆదివారాలు) సెలవులున్నాయి. అభ్యర్థులు మంచి ముహూర్తాలు చూసుకుంటూ నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. 22, 25 తేదీల్లో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలున్నాయి. నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు మూడు వాహనాలు, నలుగురికి మాత్రమే ఎన్నికల కార్యాలయంలోకి అనుమతి ఉంది. వంద మీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేస్తారు. వాహనాల కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం ప్రజాస్వరాజ్ పార్టీ (పీఎస్పీ)కి చెందిన వెలిజాల అభ్యర్థి బసవయ్య మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఆ అభ్యర్థి తనకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని అభ్యర్థించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...