యువత బ్రాండ్ అంబాసిడర్‌గా నిలువాలి


Fri,March 22, 2019 04:08 AM

షాద్‌నగర్ రూరల్ : యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకొని భవిష్యత్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా నిలువాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత చైతన్య సేవా ట్రస్ట్ చైర్మన్ జి.భిక్షపతి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం గ్రామ శివారులో గల చైతన్య సేవా ఆశ్రమంలో కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, అడవి రెండు అంశాలు అయినప్పటికీ.. విద్యార్థులు విద్యలో రాణిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని అన్నారు. యువత చదువు మూలాలను మరిచిపోవద్దని సూచించారు. పుట్టిన ఊరును, చదివిన పాఠశాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. స్వంత ఊరిలో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందించి వారి అభివృద్దికి కృషి చేయాలని పేర్కొన్నారు.

మారుమూల పల్లెల నుంచి ఎంతోమంది ఉన్నత విద్యావంతులుగా ఎదిగి ఎక్కడెక్కడో స్థిరపడుతున్నారని, కన్న ఊరును పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు తల్లి లాంటిదని, అలాంటి ఊరికి మనవంతు సేవ చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని, సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. సేవాసంస్థలు పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలన్నారు. మొక్కలను వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని తెలిపారు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, స్వచ్ఛంద సమాజ సేవలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వారం రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానన్నారు. జ్ఞానం తరుగని సంపద అని, దానిని పంచాలని సూచించారు.

రామయ్యను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలి
ఖమ్మం జిల్లాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనం రామయ్యను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలని జిల్లా అటవీ శాఖ అధికారి గంగిరెడ్డి అన్నారు. రామయ్య రోడ్లకు ఇరువైపులా వేలాది మొక్కలను నాటినందుకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసిందని చెప్పారు. యువత ఆయన అడుగుజాడల్లో ప్రతి గ్రామంలో నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతిఒక్కరూ కావాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 5 కోట్ల మొక్కలను నాటేందుకు సిద్ధం చేశామన్నారు. ప్రతి గ్రామాన్ని హరిత వనంగా మార్చేందుకు అందరూ కంకణబద్ధులై ఉండాలని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు మూడేండ్లు కంటికి రెప్పలా కాపాడితే మన జీవితాంతం ప్రాణ వాయువును అందిస్తాయని తెలిపారు. హైకోర్టు మాజీ జడ్జి భిక్షపతికి పలువురు మొక్కలు, పూల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ కె.లీల లకా్ష్మరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ కోఆర్డినేటర్ రవితేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్య, సీజీఆర్ అడ్వైజర్ పురుషోత్తంరెడ్డి, బూర్గుల, కుందేలుకుంట గ్రామాల సర్పంచ్‌లు అరుణశివ, రవీందర్‌నాయక్, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులు కృష్ణ, బీఆర్‌ఆర్ జడ్చర్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...