సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి


Thu,March 21, 2019 02:02 AM

హిమాయత్‌నగర్: సమాజంలో మహిళలు, విద్యార్థినీలకు భరోసాను కల్పిం చి, వారి రక్షణ కోసం పక డ్బందీగా చట్టాలు అమలు చేస్తూ, ఆకతాయిల వేధింపులు ఉండవనే నమ్మకంను కల్గించేందుకు తగిన చర్యలు తీసు కుంటున్నట్లు ఐజీ(లాఅండ్ ఆర్డర్) మహిళా భద్రత ఇన్‌చార్జి స్వాతిలక్రా స్పష్టం చేశారు. బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్ ఎంపావర్ మెంట్ ఆధ్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, చట్టాలపై అవగాహన సదస్సు బుధవారం నారాయణ గూడలోని బీజేఆర్ ప్రభుత్వ కళాశాల ఆవరణంలో జరిగాయి.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.బాల భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభకు స్వాతిలక్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సోషల్ మీడి యాలో ఎడాపెడా ఫొటోలు పోస్ట్ చేయడం, సమాచారం పంపించడం వల్ల ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని కొందరు ఆకతాయిలు విద్యార్థునీలు, మహిళలపై వేధింపులకు పాల్పడంతో కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం పడుతుందని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆపదలో ఉన్న సమయంలో ఎలాంటి సమస్య వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరుగా షీటీమ్స్,స్థానిక పోలీసులకు,100 నెంబర్‌కు సమాచారం అందిం చాలని సూచించారు.సమాజంలో మంచి మార్పు వచ్చినప్పుడే చక్కటి సమాజం ఆవిష్కృతమై బంగారు తెలంగాణకు బాటలు పడుతుందని అందుకు ప్రజల సహకారం ఎంతో అవసర మన్నారు. అందింవచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కృషి, పట్టుదలతో చదువుకుని ఐపీఎస్‌లో సాధించినట్లు ఆమె చెప్పారు.మంచి కలలు కని,వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుకన్య, అధ్యాపకులు రత్నా కల్యాణి, రాధిక,జ్యోతి,సంతోషి,సరిత,వేదాంతం మల్లిక,రవీందర్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...