మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచండి


Wed,March 20, 2019 12:14 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూసీనది సందరీకరణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. మంగళవారం మూసీనది అభివృద్ధి కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మూసీ కార్పొరేషన్ అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాల అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 19 చెరువుల అభివృద్ధి, సంరక్షణ చర్యలు, మూసీనది అభివృద్ధిపై ఎండీ చర్చించి పలు సూచనలు చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా పారిశుద్ధ్యం, సివరేజీ డైవర్షన్, ఆక్రమణల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, జోనల్ కమిషనర్ హరిచందన, ప్రాజెక్టు-2 డి. శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ బి.విజయ్‌కుమార్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...