నాంపల్లే కీలకం


Tue,March 19, 2019 01:40 AM

అబిడ్స్, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉన్నది. నాంపల్లి పరిధిలోని మైనార్టీ ఓట్లపై నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ కంచు కోటగా నిలిచిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఐతే మజ్లిస్ ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశాలు లేక పోవడంతో మైనార్టీ ఓట్లను సాధించే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుత ఎంపీ బండారు దత్తాత్రేయ తిరిగి బీజేపీ టికెట్‌ను ఆశిస్తుండగా కిషన్‌రెడ్డి, రాజాసింగ్, డాక్టర్ కె లక్ష్మణ్ సైతం టికెట్ వేటలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా విజయం సాధించి గత ఎన్నికల్లో ఓటమి పాలైన మందడి అంజన్‌కుమార్ యాదవ్ తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని పార్టీ ప్రకటించాల్సి ఉంది. నాంపల్లి సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ నాయకులు అప్పుడే కార్యక్రమాలను ప్రారంభించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశం విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జీ సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్ నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించి పార్టీ ప్రధాన నాయకుల దృష్టిని ఆకర్శించారు. అదే విధంగా బైక్ ర్యాలీ ద్వారా కార్యకర్తలను తరలించారు.
గెలుపే లక్ష్యంగా..
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని పార్టీలకన్నా టీఆర్‌ఎస్ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని నిర్వహించి విజయవంతం చేయగలిగింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని సెగ్మెంట్‌లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏక తాటిపైకి తీసుకు రాగలిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తన ప్రసంగం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
ఓట్ల వివరాలు..
నాంపల్లి సెగ్మెంట్‌లో మొత్తం 3,06,881 ఓట్లు ఉండగా అందులో 1,60,237 పురుష, 1,46,639 మహిళా 5 ఇతరుల ఓట్లు ఉన్నాయి. మొత్తం 294 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...