ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు పలు కమిటీలు


Tue,March 19, 2019 01:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:రాజకీయపార్టీలు చేసే వ్యయంపై గట్టి నిఘా ఏర్పాటుచేసినట్లు, ఇందులో భాగంగా వ్యయ పర్యవేక్షణకుగాను ైఫ్లెయింగ్ స్కాడ్‌లు, స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్‌లు, వీడియా సర్వెలెన్స్ టీమ్‌లు, అకౌంటింగ్ టీమ్‌లు, మీడియా మానిటరింగ్ టీమ్‌లు తదితర వాటిని ఏర్పాటుచేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) ఎం. దానకిషోర్ తెలిపారు. అంతేకాకుండా గోడలపై రాతలు, పోస్టర్లు అతికించడం, కటౌ ట్లు, బ్యానర్ల ఏర్పాటు తదితర చర్యలకు పాల్పడరాదని ఆయన స్పష్టంచేశారు.ఎన్నికల ఏర్పాట్లు, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల ప్రచార వస్తువుల ధర నిర్ణయం తదితర అంశాలపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఈఓ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి వ్యవపరిమితి రూ. 70లక్షలుగా ఎన్నికల సంఘం నిర్థారించినట్లు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల రిటర్నింగ్ అధికారులు మాణిక్‌రాజ్, రవితోపాటు ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. నామినేషన్లు ఉదయం 11నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని, ధరావత్తు రూ. 25వేలని డీఈఓ చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1400మంది మాత్రమే ఓటర్లు ఉండాలనే నిబంధన ప్రకారం 19అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని,ఒకవేళ ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500ఓటర్ల వరకు అనుమతిస్తే మూడు అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తే సరిపోతుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంతోపాటు వేసవి కారణంగా ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా టెంట్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రచార సామాగ్రికి ధరలు నిర్ణయించినట్లు, ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని డీఈఓ కోరారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...