ఆన్‌లైన్ విధానంలో కోచింగ్ అందించాలి


Tue,March 19, 2019 01:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆన్‌లైన్ పరీక్షల కనుగుణంగా కోచింగ్‌ను సైతం ఆన్‌లైన్ విధానంలో అందించాలని, మారుతున్న సమాజంతో పాటు విద్యావిధానం కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి, నవోదయ స్కూల్స్ ఫౌండింగ్ కమిషనర్ కెఎస్ శర్మ అన్నారు. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రయోజనం కోసం ఇరుడెక్స్ అందిస్తున్న వీడియో స్టడీస్, ఆన్‌లైన్ టెస్ట్‌లను ఉచితంగా అందిస్తున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అర్థవంతమైన, సమర్థవంతమైన సంస్కరణలను సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుడెక్స్ సీఈఓ విజయ్ వల్లభనేని మాట్లాడుతూ.. విద్యార్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా చేసేలా మెటీరియల్‌ను తీర్చిదిద్దామన్నారు. ఇరుడెక్స్ ద్వారా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్, టెస్ట్‌లను ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అందుకే విద్యార్థులు పరీక్షల్లో విజయవంతమయ్యేందుకు ఈ సర్వీస్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రముఖ సైకాలజిస్ట్, విద్యావేత్త డాక్టర్ సి.వీరేందర్ పాల్గొని మాట్లాడారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...