ఇంజినీరింగ్ విద్యకు ప్రధాన మూలం సైన్స్


Tue,March 19, 2019 01:24 AM

ఘట్‌కేసర్ : ఇంజినీరింగ్ విద్యకు ప్రధాన మూలం సైన్స్ అని టీఆర్‌ఎస్ శాసన మండలి విప్, అనురాగ్ కళాశాల చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ సైన్స్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి విప్‌తో పాటు డీఆర్‌డీవో శాస్త్రవేత్త ఎం. చక్రవర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిదీ సైన్స్‌తోనే ముడిపడి ఉందని సైన్స్ లేనిదే ఏదీ లేదన్నారు. ఈ రంగంలోని విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయని తెలిపారు. విద్యార్థులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. సైన్స్‌తోనే మానవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సులువుగా పరిష్కరించడానికి కొత్త పరిజ్ఞానం అవసరమని పేర్కొన్నారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్త ఎం. చక్రవర్తి మాట్లాడుతూ పరిశోధనలు చేయడానికి సైన్స్ రంగంలో కొత్తవారు అవసరమని తెలిపారు. సైన్స్ రంగంలోకి కొత్తవారు అతి తక్కువగా వస్తున్నారని మానవ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపుతుందన్నారు. సైన్స్ విద్యార్థులు పరిశోధనలకు పదునుపెట్టాలని సూచించారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ కెఎస్. రావు, డిప్యూటీ డైరెక్టర్ జి. విష్ణుమూర్తి మాట్లాడారు.కళాశాల సెక్రటరీ పల్లా నీలిమారెడ్డి, పి. మధుసూదన్ రెడ్డి, ఎన్. శ్రీనివాస రావు, కళాశాల డీన్ ముత్తారెడ్డి, హెచ్‌వోడీ. ఎం. శ్రీనివాస్ రెడ్డి, వసుధభక్షి, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ సి. మల్లేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...